AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలయ్య బాబు కాబట్టే ఆ సీన్స్ చేశారు.. మరొకరి వల్ల కాదు.. అఖండ 2 నిర్మాతలు

సింహా, లెజెండ్, అఖండ తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వస్తోన్న మరో సినిమా అఖండ 2 : తాండవం. గతంలో సంచలన విజయం సాధించిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానున్న ఈ మూవీలో సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటించింది. అలాగే హర్షాలీ మల్హోత్రా, జగపతి బాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు.

బాలయ్య బాబు కాబట్టే ఆ సీన్స్ చేశారు.. మరొకరి వల్ల కాదు.. అఖండ 2 నిర్మాతలు
Akhanda 2
Rajeev Rayala
|

Updated on: Dec 01, 2025 | 8:00 PM

Share

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

10ప్లాప్స్ రెండే రెండు హిట్స్.. అందంలో దేవకన్య ఈ వయ్యారి భామ.

అఖండ 2 ప్రాజెక్టు ఎలా మొదలైంది ప్రశ్నకు సమాధానమిస్తూ.. లెజెండ్ సినిమా మేమే చేసాము. 2014 ఎలక్షన్స్ కి ముందు ఆ సినిమా వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది. అదే కాంబినేషన్లో మళ్లీ ఈ ఎలక్షన్స్ కి ముందు ఒక సినిమా చేయాలనుకున్నాం. మేము అనుకున్న కథ సరిగ్గా ఎలక్షన్స్ ముందే రావాలి. అప్పుడే ఆ క్యారెక్టర్, కథ కనెక్ట్ అవుతుంది. సరిగ్గా ఎలక్షన్ డేట్ అనేది ఒక క్లారిటీ లేకపోవడంతో ఆ కథని పక్కనపెట్టి అఖండ2 కథని ముందుకు తీసుకెళ్లాం. బాలయ్య బాబు గారు, బోయపాటి గారిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వరసగా హ్యాట్రిక్ విజయాల తర్వాత మళ్లీ వస్తున్న సినిమా ఇది. ఈ కథ చాలా బిగ్ స్పాన్ ఉన్నది. బాలయ్య గారిలో అప్పటికి ఇప్పటికీ అదే ఎనర్జీ. ఇంకా పెరిగింది. ఆయనతో కూర్చున్నప్పుడు ఆయన ఎనర్జీ మనకి వస్తుంది.

అబ్బో.. ఇంత హాట్ బ్యూటీని ఎలా మిస్ అయ్యాం భయ్యా..!! ఈ క్రేజీ భామ గుర్తుందా.?

ఈ సినిమాని కుంభమేళాలో సూట్ చేసాం. అక్కడ షూట్ చేయాలంటే చాలా పర్మిషన్స్ కావాలి. మాకు అన్ని పర్మిషన్లు దొరికాయి. డ్రోన్ పర్మిషన్ కూడా దొరికింది. ఇప్పుడు మీరు సినిమాలో చూడబోయే ప్రతి సన్నివేశం ఈ సినిమా కోసం తీసిందే. స్టాక్ షాట్స్ ని ఉపయోగించలేదు. బోయపాటి గారు అహర్నిశలు కష్టపడి కుంభమేళా సన్నివేశాలని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు నుంచి దేశం మొత్తం రిలీజ్ చేయాలని భావించాం. అయితే పాన్ ఇండియా కోసమంటూ ప్రత్యేకంగా కథలో చేసిన మార్పులంటూ ఏమీ లేవు. ఇది పాన్ ఇండియా కంటెంట్. ఈ సినిమా కథ గ్లోబల్ గా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. సినిమాల్లో చాలా గూజ్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి. బాలయ్య బోయపాటి గారి నుంచి ఏమి ఆశిస్తారో అంతకుమించి ఉంటుంది. సినిమా చూశాం. అదిరిపోయింది. శివుడంటే మాస్ కదా.. శివతాండవం ఎంత శక్తివంతంగా ఉంటుందో ఇందులో యాక్షన్ కూడా అలానే ఉంటుంది. ఇందులో త్రిశూలం వాడినట్లుగా మరో సినిమాలో వాడలేరు. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ అంతా జార్జియాలో చేశాం. నిజానికి కాశ్మీర్లో చేయాల్సింది కానీ అదే సమయంలో పెహెల్గాం దాడి జరగడంతో పర్మిషన్స్ ఇష్యూ వచ్చింది. జార్జియాలో మైనస్ డిగ్రీ చలిలో షూట్ చేశాము. మేమందరం చలిలో స్వెటర్లు వేసుకున్నాం. కానీ బాలయ్య గారు అఘోర గెటప్ లో స్లీవ్ లెస్ లో అలా చలిలోనే అద్భుతంగా నటించారు. ఆయన కాబట్టి చేశారు. మరొకరు అయితే అంత చలిలో అలాంటి యాక్షన్ చేయడం అసాధ్యం.

మహేష్ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లి ఏడ్చుకుంటూ వచ్చేశా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .