AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లి ఏడ్చుకుంటూ వచ్చేశా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.

మహేష్ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లి ఏడ్చుకుంటూ వచ్చేశా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 29, 2025 | 10:24 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. గ్లోబల్ ట్రాటర్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. వారణాసి అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా నటిస్తుంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి టైటిల్ ను అలాగే మహేష్ బాబు లుక్ ను రిలీజ్ చేశారు. ఈ మేరకు రాజమౌళి భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ సినిమా నుంచి టీజర్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే మహేష్ బాబు సినిమా ఆడిషన్స్ కు వెళ్లి ఏడ్చుకుంటూ వచ్చాను అని ఓ హీరోయిన్ చెప్పుకొచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూపులు

ఒకప్పుడు తన అందంతో కవ్వించిన భామ సమీరారెడ్డి.. నరసింహుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆశోక్ చిత్రంతో సక్సెస్ అందుకుంది. తెలుగులో అతి తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడికి భారీగానే ఫాలోయింగ్ ఉంది. అలాగే హిందీలోనూ నటించి ఆకట్టుకుంది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న సమీరా.. తన ఫిట్ నెస్ వీడియోలతో అలరిస్తుంది. అలాగే తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు.. కెరీర్ కు సంబంధించిన విషయాలను చెప్పుకొస్తుంది. అలాగే తాను ప్రెగ్నేన్సీ సమయంలో లావుగా మారడంతో ఎన్నో ట్రోల్ ఎదుర్కొన్నానని.. దీంతో వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా శ్రమించానని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ ఊపేస్తోంది.. సోషల్ మీడియా సెన్సేషన్ ఈ భామ

గతంలో ఆమె మాట్లాడుతూ.. తాను సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆడిషన్ ఇచ్చినట్లు తెలిపింది. కానీ అందులో సరిగా చేయలేక ఆరోజు కన్నీళ్లతో ఇంటికి వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చింది. “నా మొట్ట మొదటి సినిమా ఆడిషన్ 1998లో జరిగింది. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం. ఆ రోజు చాలా భయంతోనే ఉన్నాను. వాళ్లు ఇచ్చిన టాస్క్ చేయలేక అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయాను. అప్పటివరకూ ఏదైతే డెస్క్ జాబ్ చేశానో మళ్లీ అదే కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత కొద్దిరోజులకు ధైర్యం చేసుకుని మొదటిసారి ప్రైవేట్ ఆల్బమ్ కోసం కెమెరా ముందుకు వచ్చాను. ” అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. అయితే సమీరా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో  మరోసారి వైరలవుతుంది.

బస్సులో నుంచి దించేశారు.. భోజనం చేస్తుంటే అవమానించారు.. రాజు వెడ్స్ రాంబాయి దర్శకుడి కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి