AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూపులు

సోషల్ మీడియాలో చాలా మంది అందాల భామల చైల్డ్ హుడ్ ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఓ అందాల భామ చైల్డ్ హుడ్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? ఆమె ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ ..

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూపులు
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2025 | 1:19 PM

Share

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆ చిన్నది. మలయాళీ చిత్రపరిశ్రమకు చెందిన ఈ అమ్మాయి బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత  హీరోయిన్ గా మారి వెండితెరపై సందడి చేసింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. పేరుకు మలయాళీ అయినా తెలుగులోనే ఎక్కువగా క్రేజ్ సొంతం చేసుకుంది. చూడటానికి పక్కింటి అమ్మాయిలా ఉండే ఈ భామ తన అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది.

అతి తక్కువ సమయంలో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రాలేదు. కానీ చేసిన ప్రతి సినిమాలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఇన్నాళ్లు హీరోయిన్ ప్రేక్షకులను అలరించిన ఈ వయ్యారి.. తొలిసారిగా అమ్మ పాత్రలో కనిపించి అద్భుతమైన నటనతో ఆశ్చర్యపరిచింది. నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవలే ఓటీటీలో ఓ సూపర్ హిట్ సినిమాలో కనిపించింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ నివేదా థామస్. ఇటీవలే 35 చిన్న కథ కాదు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో నటించింది. ఇందులో అమ్మ పాత్రలో మెప్పించింది.

ఇవి కూడా చదవండి

1995 నవంబర్ 2న కన్నూర్ ప్రాంతంలో జన్మించింది నివేదా. 2002లో మలయాళంలో ఉత్తర అనే సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బుల్లితెరపై మై డియర్ భూతం అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరించింది. 2016లో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్మెన్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రేచేవారెవరురా, దర్బార్, వకీల్ సాబ్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నివేదా థామస్.. తన అందమైన ఫొటోలతో కవ్విస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..