- Telugu News Photo Gallery Cinema photos Actress Faria Abdullah says she would go on a date with Pawan Kalyan
ఛాన్స్ వస్తే పవన్ కళ్యాణ్‌తో డేటింగ్ చేస్తా.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ ముద్దుగుమ్మ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నరు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే ఇప్పటికే రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మొన్నామధ్య హరిహరవీరుమల్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవన్.
Updated on: Nov 28, 2025 | 1:51 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నరు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే ఇప్పటికే రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మొన్నామధ్య హరిహరవీరుమల్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవన్.

ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత రీసెంట్ గా ఓజీ సినిమాతో మరోసారి థియేటర్స్ దగ్గర సందడి చేశారు పవన్. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ మంచి విజయాన్ని అందుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో పవన్ లుక్స్, యాక్షన్, ప్రేక్షకులను ముఖ్యంగా పవన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఓ ముద్దుగుమ్మ పవన్ కల్యాణ్ తో డేటింగ్ చేస్తా.. అని చెప్పి షాక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ తో డేటింగ్ చేస్తానన్నా ఆ బ్యూటీ ఎవరో తెలుసా..? తన అందంతో ప్రేక్షకులను విశేషంగా కవ్వించిన బ్యూటీస్ లో ఫరియా అబ్దుల్లా ఒకరు.. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంది ఈ అందాల భామ. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఫరియా అబ్దుల్లా ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది.

గతంలో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. నీకు ఛాన్స్ వస్తే ఎవరితో డేట్ చేస్తావ్.? ఎవరిని పెళ్లి చేసుకుంటావ్.? అని సుమ అడిగితే.. ఊహించని సమాధానం చెప్పింది ఈ ముద్దుగుమ్మ. నాకు ఛాన్స్ వస్తే పవన్ కల్యాణ్ తో డేటింగ్ చేస్తా.. ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా.. అని చెప్పుకొచ్చింది ఈ చిన్నది.

ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ పై పవన్ , ప్రభాస్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో ఫరియా అబ్దుల్లా గ్లామర్ గేట్లు ఎత్తేసి ఓ రేంజ్ లో కుర్రాళ్లను కవ్విస్తుంది.




