AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు మెకానిక్ షెడ్డులో పని.. కట్ చేస్తే 100కుపైగా సినిమాలు.. టాలీవుడ్ ఎప్పటికీ మర్చిపోలేని నటుడు

సినిమా ఇండస్ట్రీలోనే అతను టాప్ హీరో. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులు తెగ సందడి చేసేవారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఓ సాధారణ కుర్రాడు నటుడిగా తెలుగు ప్రజల మనస్సులో స్థానం సంపాదించుకున్నాడు. విలన్ గా , హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు,

ఒకప్పుడు మెకానిక్ షెడ్డులో పని.. కట్ చేస్తే 100కుపైగా సినిమాలు.. టాలీవుడ్ ఎప్పటికీ మర్చిపోలేని నటుడు
Tollywood Hero
Rajeev Rayala
|

Updated on: Nov 24, 2025 | 3:10 PM

Share

తెలుగు సినిమాల్లో ఎంతో మంది ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ గా మారిన నటులు చాలా మంది ఉన్నారు. పైన కనిపిస్తున్న హీరో కూడా వారిలో ఒకరు. చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన స్టార్ గా ఎదిగాడు. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.? నటుడిగానే కాదు మంచి మనసున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు ఆయన కొన్నాళ్ళు పాల వ్యాపారం చేశారు. ఆతర్వాత ఓ మెకానిక్ షెడ్ నడిపారు. జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్ ఆయన మిస్టర్ హైదరాబాద్‌గా ఏడుసార్లు అవార్డు అందుకున్నాడు ఇంతకూ ఆయన ఎవరంటే..

ఏం సినిమా రా బాబు.! భయంతో వాంతులు చేసుకోవడం ఖాయం.. ఎక్కడ చూడొచ్చంటే

విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీహరి. విలన్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీహరి ఆతర్వాత హీరోగా సినిమాలు చేశారు. ఎన్నో సినిమాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించాడు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు, సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి. ఇండస్ట్రీలో ఇప్పటికి ఆయన గురించి.. ఆయన మంచి తనం గురించి చెప్పుకుంటుంటారు. స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీహరి.. అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. 1989లో తమిళ సినిమా మా పిళ్ళై, తెలుగు ‘ధర్మక్షేత్రం’ చిత్రం ద్వారా సినిమాల్లోకి అడుగు పెట్టారు. శ్రీహరి దాదాపు 100 సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. శ్రీహరి నటనతో ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు.

లక్ అంటే ఈ బ్యూటీదే.. స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న క్రేజీ హీరోయిన్.. 11ఏళ్ల తర్వాత ఇలా..

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అద్భుత పాత్రల్లో నటించారు శ్రీహరి. మగధీర సినిమాలో ఆయన పాత్ర సినిమాకే హైలైట్ అని చెప్పాలి. షేర్ ఖాన్ పాత్ర‌లో త‌న గంభీర‌మైన గొంతుతో డైలాగులు చెప్పి ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేశారు. శ్రీహ‌రి హీరోగా న‌టించిన కుబుసం, భ‌ద్రాచ‌లం సినిమాలు మంచి విజయం సాధించాయి. అలాగే మంచు విష్ణు హీరోగా నటించిన ఢీ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, ఢీ, కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే సినిమాల్లోకి రాక ముందు శ్రీహరి ఏం చేశేవారో తెలుసా.? జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర స్థాయి చాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్ అవ్వాలనుకున్నారు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా.. సినిమాలపై మక్కువతో ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కాగా సినిమాల్లోకి రాక ముందు ‘మిస్టర్ హైదరాబాద్ గా ఏడుసార్లు అవార్డును సొంతం చేసుకున్నారు. ఏషియన్ గేమ్స్ లో భారతదేశం తరపున ఆడాలనే కోరిక ఉన్నా అది తీరలేదు.

రోజూ రాత్రి అలా చేయకపోతే నాకు నిద్రపట్టదు.. ఫిజికల్ టచ్ ఉండాల్సిందే అంటున్న బ్యూటీ

Shrihari

Shrihari

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి