AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రమోషన్స్ లేవు, పెద్ద సినిమా కాదు.. రూ. 5 కోట్లు పెడితే.. రూ.60 కోట్ల కలెక్షన్లు

చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా రీసెంట్ డేస్ లో సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పెద్ద సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయ్యి కోట్లు కురిపిస్తున్నాయి. అలాగే చిన్న సినిమాలు కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి.

ప్రమోషన్స్ లేవు, పెద్ద సినిమా కాదు.. రూ. 5 కోట్లు పెడితే.. రూ.60 కోట్ల కలెక్షన్లు
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2025 | 7:49 AM

Share

ఓటీటీలో సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్‌లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నపటికీ ఓటీటీలో సినిమాలకు మాత్రం ఎక్కడా డిమాండ్ తగ్గడం లేదు. వారాంతం వచ్చిందంటే చాలు పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు.. ఇతర బాషల సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైమెంట్ ఇస్తున్నాయి. కాగా ప్రస్తుతం పాన్ ఇండియా హవా నడుస్తుంది. బడా హీరోలంతా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్న సినిమాలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన కూడా భారీగా వసూల్ చేసి అందరూ ఆశ్చర్యపడేలా చేస్తున్నాయి. తాజాగా ఓ సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ వసూళ్లను రాబట్టి.

చిన్న సినిమాగా వచ్చి ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుందీ సినిమా.. థియేటర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తుంది. ఆ సినిమా పేరు సూక్ష్మదర్శిని. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నజ్రియా నజీమ్ ప్రధాన పాత్రలో నటించింది. నజ్రియా నజీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఈ చిన్నది ఒకే ఒక్క సినిమా చేసింది. కానీ ఇక్కడి ప్రేక్షకులకు అంతకంటే ముందే పరిచయం అయ్యింది. తమిళ్ లో ఈ చిన్నది నటించిన రాజా రాణి సినిమా మనదగ్గర భారీ విజయాన్ని అందుకుంది.

బాసిల్, నజ్రియా నజీమ్ జంటగా నటించిన సూక్ష్మదర్శిని డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఊహించిన దానికంటే ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, దాదాపు రూ.60 కోట్ల కలెక్షన్లు సాధించింది. మిస్టరీ, థ్రిల్లర్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక ఈ సినిమా క్లామాక్స్ అస్సలు ఊహించలేరు. థియేటర్స్ లో తెలుగులోనూ రిలీజ్ అయ్యింది ఈ సినిమా.. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా మంచి వ్యూస్ సొంతం చేసుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికా సెగతో ఇరాన్ లో అట్టుడికిన ఆందోళనలు! వీడియో
అమెరికా సెగతో ఇరాన్ లో అట్టుడికిన ఆందోళనలు! వీడియో
ఈడీ vs బెంగాల్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
ఈడీ vs బెంగాల్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
ఇంటర్నెట్ లేకుండా కీప్యాడ్ ఫోన్‌తో UPI పేమెంట్స్ చేయడం ఎలా?
ఇంటర్నెట్ లేకుండా కీప్యాడ్ ఫోన్‌తో UPI పేమెంట్స్ చేయడం ఎలా?
తులసి మొక్కతోపాటు ఈ మొక్కలు ఇంట్లో నాటితే,డబ్బు కష్టాలు తీరినట్టే
తులసి మొక్కతోపాటు ఈ మొక్కలు ఇంట్లో నాటితే,డబ్బు కష్టాలు తీరినట్టే
మహేష్ బాబు లుక్స్ సీక్రెట్స్ ఇవే.. అసలు విషయాలు చెప్పిన మంజుల ఘట్
మహేష్ బాబు లుక్స్ సీక్రెట్స్ ఇవే.. అసలు విషయాలు చెప్పిన మంజుల ఘట్
ఒకరు కాదు ఇద్దరు..ది రాజాసాబ్‌ను ఆ స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా?
ఒకరు కాదు ఇద్దరు..ది రాజాసాబ్‌ను ఆ స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా?
నా మనవడికి భోగి పళ్లు పోస్తున్నాం వీడియో
నా మనవడికి భోగి పళ్లు పోస్తున్నాం వీడియో
వాళ్లిద్దరూ పార్టీ మారినట్టు ఆధారాలు లేవు: స్పీకర్‌ గడ్డం ప్రసాద్
వాళ్లిద్దరూ పార్టీ మారినట్టు ఆధారాలు లేవు: స్పీకర్‌ గడ్డం ప్రసాద్
ముగ్గులు బియ్యం పిండితో ఎందుకు వేస్తారు? సంప్రదాయమే కాదు మరో కోణం
ముగ్గులు బియ్యం పిండితో ఎందుకు వేస్తారు? సంప్రదాయమే కాదు మరో కోణం
జనవరి 16న బ్యాంకులకు సెలవు ఉంటుందా..?
జనవరి 16న బ్యాంకులకు సెలవు ఉంటుందా..?