AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyamani: మాకేం తక్కువ.. వాళ్లే కాదు మేము అందమగానే ఉంటాం.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్

రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన యమదొంగ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. యమదొంగ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ప్రియమణి పేరు మారుమ్రోగింది. బ్యాక్ టు బ్యాక్ ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోల సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

Priyamani: మాకేం తక్కువ.. వాళ్లే కాదు మేము అందమగానే ఉంటాం.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్
Priyamani
Rajeev Rayala
|

Updated on: Mar 29, 2024 | 1:45 PM

Share

ఒకప్పుడు వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది అందాల భామ ప్రియమణి. పెళ్ళైన కొత్తలో సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది ఈ చిన్నది. జగపతిబాబు హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రియమణి తన నటనతో ఆకట్టుకుంది. ఆతర్వాత దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన యమదొంగ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. యమదొంగ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ప్రియమణి పేరు మారుమ్రోగింది. బ్యాక్ టు బ్యాక్ ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోల సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పించినేది ప్రియమణి.

ఇటీవలే జవాన్ సినిమాతో హిందీలోకి అడుగు పెట్టింది. అంతకు ముందు షారుఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. జవాన్ సినిమాలో కీలక పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇదిలా ఉంటే ఇటీవల ప్రియమణి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొన్నామధ్య బాలీవుడ్ నటీ నటులు ఫోటోగ్రాఫర్స్ ను జిమ్ దగ్గర ఎయిర్ పోర్ట్ దగ్గర డబ్బులిచ్చి ఏర్పాటు చేసుకుంటారని తెలిపింది.

ప్రియమణి ఆర్టికల్ 370 అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..  నార్త్, సౌత్ గురించి కామెంట్స్ చేసింది. బాలీవుడ్ వాళ్లు కాస్త ఫెయిర్ గా ఉంటారన్నది నిజమే కానీ మేము ఏం తక్కువ కాదు.. మేము అందంగానే ఉంటాం అని కామెంట్స్ చేసింది ప్రియమణి. కొంతమంది బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఫోన్ చేసి సౌత్ నటి కాబట్టి మీకు ఈ సినిమాలో ఛాన్స్ ఇస్తున్నాం అంటుంటారు. తొందర్లోనే దీనిలో మార్పు వస్తుంది అని నేను అంటుకుంటున్నా .. మేము సౌత్ వాళ్లమే అయినా మేము హిందీ బాగా మాట్లాడగలం.. అంతే కాదు అందంలోనూ మేం ఏం తక్కువ కాదు. మేము హిందీ భాషను అనర్గళంగా మాట్లాడుతాం.. అలాగే నటనలో ఎక్స్ ప్రెషన్స్ కూడా చక్కగా పలికిస్తాము. అయినా ఈ నార్త్ సౌత్ తేడా ఉండకూడదు. అందరం ఇండియన్ నటులమే అని తెలిపారు ప్రియమణి.

ప్రియమణి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Priya Mani Raj (@pillumani)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.