Darling Glimpse: ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే.. ప్రోమో రిలీజ్..
వీరిద్దరి డార్లింగ్ గొవడ ఏంటీ ?.. అసలు ఉన్నట్లుండి ఈ డార్లింగ్ పంచాయితీ ఎందుకు వచ్చింది ? అంటూ తలలు పట్టుకున్నారు నెటిజన్స్. అయితే ప్రతిసారి డార్లింగ్ పదం కామెంట్ చేస్తూ ప్రియదర్శి ఎందుకు వై దిస్ కొలవరి ట్యాగ్ ఇవ్వడంతో ఏదో సినిమా ప్రమోషన్ కావచ్చు అనే సందేహాలు మొదలయ్యాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు పలుకుతూ అసలు విషయం చెప్పేశాడు ప్రియదర్శి.
గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో డార్లింగ్ పంచాయితీ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. నటుడు ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్ మధ్య నెట్టింట మాటల యుద్ధం జరుగుతుంది. డార్లింగ్ అంటూ ప్రియదర్శి అనడం.. అలా పిలిస్తే నేరమే అంటూ నభా వార్నింగ్ ఇవ్వడం చూస్తున్నాం. ఇక వీరిద్దరి గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ కూడా ఎంటరయ్యింది. తన పోస్టులు.. కామెంట్స్ సెక్షన్ ఇద్దరి గోల ఏంటీ అంటూ సీరియస్ అయ్యింది. అయితే వీరిద్దరి డార్లింగ్ గొవడ ఏంటీ ?.. అసలు ఉన్నట్లుండి ఈ డార్లింగ్ పంచాయితీ ఎందుకు వచ్చింది ? అంటూ తలలు పట్టుకున్నారు నెటిజన్స్. అయితే ప్రతిసారి డార్లింగ్ పదం కామెంట్ చేస్తూ ప్రియదర్శి ఎందుకు వై దిస్ కొలవరి ట్యాగ్ ఇవ్వడంతో ఏదో సినిమా ప్రమోషన్ కావచ్చు అనే సందేహాలు మొదలయ్యాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు పలుకుతూ అసలు విషయం చెప్పేశాడు ప్రియదర్శి. ఇదంతా కేవలం తమ మూవీ ప్రమోషన్ కోసమే అంటూ క్లారిటీ ఇచ్చారు.
ప్రియదర్శి, నభా నటేష్ ప్రధాన పాత్రలలో ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక సబ్ టైటిల్ వై దిస్ కొలవెరి. తాజాగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ.. ప్రోమోనూ కూడా రిలీజ్ చేశారు. అమ్మా.. చెల్లి.. ప్రియురాలు గురించి ఎంతో అందంగా చెప్పిన ప్రియదర్శి.. భార్య గురించి చెబుతూ భయపడిపోతుంటాడు. భార్యభర్తల మధ్య జరిగే ఫన్నీ గొడవల నేపథ్యంలో ఈ మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి తమిళ్ డైరెక్టర్ అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్ హనుమాన్ మూవీని అందించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో అనన్య నాగళ్ల, మురళీధర్ గౌడ్, కృష్ణ తేజ కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను అనౌన్స్ చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.