Salaar Movie: ప్రభాస్ హెల్పింగ్ హ్యాండ్ ఇస్తానంటున్న మాలీవుడ్ హీరో.. ‘సలార్’లో ఆ విలక్షణ నటుడు కూడా..
సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయిన పాన్ ఇండియా స్టార్ అనే పేరును నిలబెట్టుకుంటున్నారు డార్లింగ్ ప్రభాస్. కాకపోతే... ఆ ట్యాగ్ నిలబడాలంటే కటౌట్ సైజులు భద్రంగా ఉండాలంటే కొత్తగా కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పడం లేదట మిస్టర్ పర్‌ఫెక్ట్‌కి.
సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయిన పాన్ ఇండియా స్టార్ అనే పేరును నిలబెట్టుకుంటున్నారు డార్లింగ్ ప్రభాస్(Prabhas). కాకపోతే… ఆ ట్యాగ్ నిలబడాలంటే కటౌట్ సైజులు భద్రంగా ఉండాలంటే కొత్తగా కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పడం లేదట మిస్టర్ పర్‌ఫెక్ట్‌కి. అందుకేనేమో… ఇలా ప్లాన్ బీ, ప్లాన్ సీ అంటూ రకరకాల కసరత్తులు షురూ చేస్తున్నారు. ఏ శాస్త్రమూ వందకు వందశాతం కరెక్ట్ కాదు… అనేది రాధేశ్యామ్ సినిమా స్టోరీకి బాటమ్‌లైన్. ఇది నమ్మదగ్గ నగ్నసత్యం కూడా. అందుకే ఈ నేకెడ్ ట్రూత్‌ని తన కెరీర్ మీద కూడా ఇంప్లిమెంట్ చెయ్యబోతున్నారట హీరో ప్రభాస్. సోలో ఇమేజ్‌తోనే ప్రతిసారీ సక్సెస్ కొట్టగలమన్న థియరీ నుంచి కాస్త టర్న్ తీసుకుంటున్నట్టు డార్లింగ్ మూమెంట్స్ చెబుతున్నాయి. మొన్న సాహో, నిన్న రాధేశ్యామ్.. డైహార్ట్ ఫ్యాన్స్‌ని ఫుల్‌టుఫుల్ శాటిస్‌ఫై చెయ్యలేకపోయిన భారీ సినిమాలు. ఈసారి సలార్ మూవీతోనైనా సెంట్‌పర్సెంట్ సక్సెస్‌ని టేస్ట్ చేయించాలన్నది ప్రభాస్ కమిట్‌మెంట్. అందుకే.. సలార్ మూవీ కంపోజిషన్‌తో పాటు, కాస్టింగ్ మీద కూడా స్పెషల్‌గా ఫోకస్ చేశారు. కేజీఎఫ్ స్పెషలిస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మైండ్‌సెట్‌ని కూడా మార్చేశారట.
ఎప్పుడూ సోలో హీరోయిజాన్నే గట్టిగా నమ్ముకునే ప్రశాంత్ నీల్… సలార్‌లో ప్రభాస్‌కి దాదాపు పార్లల్‌గా మాలీవుడ్ హీరో పృథ్విరాజ్ కోసం మరో రోల్ రాసిపెట్టారు. బిజీగా వుండి డేట్స్ ఇవ్వలేనంటున్న పృథ్విరాజ్‌ని ఎలాగోలా ఒప్పించి సలార్ సెట్స్‌కి తీసుకొస్తున్నారట. అటు… నాగీ డైరెక్ట్ చేస్తున్న సైఫై మూవీ ప్రాజెక్టు-Kలో అమితాబ్ బచ్చన్ అండ్ దీపికా పదుకోన్ నుంచి బిగ్ సపోర్ట్ ఉండనే వుంది. ఓం రౌత్ చేస్తున్న మైథలాజికల్ వండర్ ఆదిపురుష్‌లో కూడా ప్రభాస్‌ది సోలో స్టార్‌డమ్ కాదు. ప్రతినాయకుడిగా నటిస్తున్న సైఫ్ ఆలీ ఖాన్ బాలీవుడ్‌లో కమర్షియల్ వెయిట్ పెంచే ఛాన్సుంది. ఇలా డార్లింగ్ చేస్తున్న ప్రతీ పాన్ ఇండియా మూవీకీ మేమున్నాం అంటూ హెల్పింగ్ హ్యాండ్ ఇస్తున్నారు మిగతా స్టార్లు. డార్లింగ్ కటౌట్ సైజ్ తగ్గకుండా వీళ్లంతా సపోర్టింగ్ రోల్స్‌తో కాపాడబోతున్నారన్నమాట.
మరిన్ని ఇక్కడ చదవండి :