మహేష్ బాబు, రాజమౌళి సినిమా పై క్లారిటీ ఇచ్చేసిన పృథ్వీరాజ్.. ఆ కిక్కే వేరు అంటూ..
సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు చివరిగా నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. దాంతో మహేష్ బాబు, రాజమౌళి సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా మహేష్ బాబు ,ఎస్.ఎస్. రాజమౌళి సినిమా . ఈ సినిమా “SSMB 29” అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది, ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అలాగే ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే కథ అని, ఇందులో మహేష్ బాబు ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. అలాగే మహేష్ పాత్ర రామాయణంలోని హనుమంతుడి నుండి స్ఫూర్తి పొందినట్లుగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.
ఇక ఈ చిత్రంలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించేందుకు గత కొంతకాలంగా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ముఖ్యంగా జర్మనీలో ట్రెక్కింగ్, ఫిట్‌నెస్ శిక్షణ పూర్తి చేసి వచ్చాడు. రాజమౌళి ఈ సినిమాని పాన్-ఇండియా స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తుంది. ఆమె పాత్ర నెగిటివ్ షెడ్ లో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. అలాగే విలన్‌గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి.
అయితే ఇటీవలే ఓ ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు, పృథ్వీరాజ్ కలిసి కనిపించారు. దాంతో SSMB 29లో పృథ్వీరాజ్ కూడా నటిస్తున్నారని వార్తలు జోరుగా సాగాయి. అలాగే సినిమా షూటింగ్ నుంచి ఓ సీన్ కూడా లీక్ అయ్యింది. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. లీక్ వీడియోలు చూడటంలో అంత ఆసక్తి ఏముంటుంది. బిగ్ స్క్రీన్ పై సినిమా చూస్తే ఫీల్ డబుల్ ఉంటుంది. అలాగే రాజమౌళి సినిమాలో నేను ఏడాది క్రితమే భాగమయ్యాను. షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దాని గురించి ఇప్పుడేం మాట్లాడలేను. త్వరలోనే దీనిపై టీమ్ నుంచి అప్డేట్స్ రావాలని కోరుకుందాం. అని అన్నారు. ఇక హాలీవుడ్ నటులు మరియు టెక్నీషియన్లు కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యారని తెలుస్తుంది. ఇది రెండు భాగాలుగా 2027 మరియు 2029లో విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు. రాజమౌళి తన గత చిత్రాల్లా కాకుండా, ముందుగా విజువల్ ఎఫెక్ట్స్‌పై దృష్టి పెట్టి, ఆ తర్వాత షూటింగ్ చేసే విధానాన్ని అనుసరిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే 40శాతం వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తయినట్లు సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..