Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venu Swamy: మరోసారి సమంత పై వివాదాస్పద కామెంట్స్ చేసిన వేణు స్వామి.. ప్రభాస్ పై కూడా..

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీల జాతకాలు చెబుతూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నారీ ఆస్ట్రాలజర్. అదే సమయంలో కొన్ని సున్నితమైన విషయాలను టచ్ చేసి ఇబ్బందుల్లో పడ్డారు. నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితంపై వేణు స్వామి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

Venu Swamy: మరోసారి సమంత పై వివాదాస్పద కామెంట్స్ చేసిన వేణు స్వామి.. ప్రభాస్ పై కూడా..
Samantha
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 22, 2025 | 12:58 PM

వేణు స్వామి.. పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేని పేరు ఇది. సినిమా సెలబ్రెటీల జాతకాలు చెప్పడం, రాజకీయనాయకుల జాతకాలు చెప్పడంతో చాలా పాపులర్ అయ్యారు ఈయన. సెలబ్రెటీలు జాతకాలు చెప్పడంతో ఆయన సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాడు. ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ కొన్ని నెలల క్రితం సంచలన ప్రకటన చేసిన వేణు స్వామీ.. మొన్నామధ్య నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు. దీంతో అక్కినేని అభిమానులు గురూజీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జర్నలిస్టు సంఘాలు కూడా స్వామీజీ పై ఫైర్ అయ్యాయి. ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న వేణు స్వామి ఇప్పుడు మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశాడు.

తాజాగా వేణు స్వామికి సంబంధించిన ఓ ఆడియో లీక్ అయ్యింది. ఆ వీడియోలో మరోసారి ఆయన టాలీవుడ్ సెలబ్రెటీల పై షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ, ప్రభాస్, సమంత గురించి మరోసారి ఆయన నోరు పారేసుకున్నాడు. సినిమా వాళ్లు ముగ్గురు త్వరలోనే చనిపోతారు. వారిలో ఓ హీరో, ఓ హీరోయిన్ కూడా ఉన్నారు అంటూ వివాస్పద కామెంట్స్ చేసింది. వాళ్లలో విజయ్ దేవరకొండ, ప్రభాస్, సమంత ఉంటారు అని చెప్పుకొచ్చాడు.

శాస్త్రం ప్రకారం సమంత, విజయ్ దేవరకొండలో ఎవరో ఒకరు సూసైడ్ చేసుకోవడం ఖాయం.. ఈ విషయం బయటికి రావడానికి టైం పడుతుంది అంటూ నోటికొచ్చినట్టు వాగాడు. అలాగే ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ కు ఒళ్లంతా గాయాలే ఆ విషయం ఎవరికి చెప్పడం లేదు. అందుకే రాజా సాబ్ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాతో పాటు సినీ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. దాంతో నెటిజన్స్ వేణు స్వామిపై మండిపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉప్పల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్ల ఊచకోత.. బద్దలైన పవర్ ప్లే రికార్డ్
ఉప్పల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్ల ఊచకోత.. బద్దలైన పవర్ ప్లే రికార్డ్
సావిత్రి వారసుడిగా ఎన్నో ఆశలతో సినిమాలో అడుగు పెట్టినా...
సావిత్రి వారసుడిగా ఎన్నో ఆశలతో సినిమాలో అడుగు పెట్టినా...
కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. చర్మ సమస్యలతో సినిమాలకు దూరమైన హీరోయిన్.
కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. చర్మ సమస్యలతో సినిమాలకు దూరమైన హీరోయిన్.
సాయంత్రం వాకింగ్‌కి వెళ్లిన మహిళ.. బీచ్‌లో కనిపించింది చూసి...
సాయంత్రం వాకింగ్‌కి వెళ్లిన మహిళ.. బీచ్‌లో కనిపించింది చూసి...
కారం కోసమే కాదు పచ్చిమిర్చిని ఇలా ఎప్పుడైనా వాడాారా?
కారం కోసమే కాదు పచ్చిమిర్చిని ఇలా ఎప్పుడైనా వాడాారా?
ఔరంగజేబుపై దత్తాత్రేయ హోసబాలే కీలక వ్యాఖ్యలు
ఔరంగజేబుపై దత్తాత్రేయ హోసబాలే కీలక వ్యాఖ్యలు
Video: ఆర్చర్‌కి 'హెడ్' టార్చర్.. షాకైన హైదరాబాద్ కెప్టెన్
Video: ఆర్చర్‌కి 'హెడ్' టార్చర్.. షాకైన హైదరాబాద్ కెప్టెన్
సమ్మర్‌లో దొరికే మరో అద్భుత ఫలం..ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
సమ్మర్‌లో దొరికే మరో అద్భుత ఫలం..ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
భారతీయులకు షాకిచ్చిన వాట్సాప్‌.. 99 లక్షల ఖాతాలపై నిషేధం!
భారతీయులకు షాకిచ్చిన వాట్సాప్‌.. 99 లక్షల ఖాతాలపై నిషేధం!
నడుము లేదా మెడలో నిరంతరం నొప్పా.. నిర్లక్షం వద్దు.. ఎందుకంటే
నడుము లేదా మెడలో నిరంతరం నొప్పా.. నిర్లక్షం వద్దు.. ఎందుకంటే