ఇదెక్కడి దరిద్రం..! అదిదా సర్‌ప్రైజ్ సాంగ్ స్టెప్పుతో రీల్స్.. మండిపడుతున్న నెటిజన్స్
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఇటీవల వచ్చిన ఫిర్యాదుల మేరకు, కొన్ని సినిమాల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ మహిళలను కించపరిచేలా, అసభ్యకరంగా ఉన్నాయని గుర్తించింది. ఈ అంశంపై తీవ్రంగా స్పందించిన కమిషన్, సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు సహా సంబంధిత వర్గాలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది

సినిమా పాటలు ప్రేక్షకులను ఎప్పుడు ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని పాటలు అసభ్యకర పదాలతో నిండిపోతున్నాయి. సాహిత్యం లేకుండా అడ్డదిడ్డంగా పదాలతో నిండిపోతున్నాయి. అలాగే కొన్ని పాటల డాన్స్ స్టెప్పులు కూడా అనేక విమర్శలకు , చర్చలకు దారితీసుతున్నాయి. చూస్తేనే విరక్తి పుట్టేలా కొన్ని డాన్స్ మూమెంట్స్ ఉంటునాయి. రీసెంట్ డేస్ లో విడుదలైన కొన్నిపాటల డాన్స్ మూమెంట్స్ మహిళలను కించపరిచేలా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ మహిళా కమిషన్ కూడా కొంతమంది కొరియోగ్రాఫర్స్ పై సీరియస్ అయ్యింది. అయితే తాజాగా విడుదలైన ఓ సాంగ్ కు సంబంధించిన డాన్స్ మూమెంట్ కూడా ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది. అయితే ఆ సాంగ్ లో చిరాకు పుట్టించిన ఆ డాన్స్ మూమెంట్ ను సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ అని చెప్పుకునే కొంతమంది రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సినిమాల్లో పాటలకు ఏదైనా హుక్ స్టెప్ కనిపిస్తే చాలు.. ఆ స్టెప్ ను రీల్స్ చేసి ఆ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. సినిమా వాళ్లు ఏ డ్రస్ వేసుకున్నారో అదే డ్రస్సులు వేసి అదే స్టెప్ ను రీ క్రియేట్ చేస్తుంటారు. తాజాగా నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమా నుంచి కేతిక శర్మ చేసిన స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ సాంగ్ లో కేతికతో ఓ చెత్త స్టెప్ వేయించాడు కొరియోగ్రాఫర్. ఇంకేముంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ వెంటనే ఆ స్టెప్ ను రీల్స్ చేయడం మొదలు పెట్టారు.
ఆ పాటలో నటి కేతిక ఎలా అయితే చేసిందేమో అదెలా చేసి వీడియోలు పోస్ట్ చేశారు. కొంతమంది ఆమె వేసుకున్నట్టు మల్లెపూల జాకెట్ వేసుకొని కూడా డాన్స్ చేశారు. దాంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. వీడియోలు వైరల్ కావడంతో నెట్టింట దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఇంత దిగజారాలా.. ఏంటి ఈ దరిద్రం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకొంతమంది పచ్చిగా కూడా తిడుతున్నారు. కేతిక శర్మ అంటే డబ్బుల కోసం మరీ మీరంతా ఎందుకు చేశారంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
Reels are pouring in with hook-step of #AdhidhaSurprisu 🔥#Robinhood https://t.co/4a4cT2qO2B pic.twitter.com/BZiMM45VB1
— idlebrain jeevi (@idlebrainjeevi) March 19, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..