Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: టవల్‌తో ఉన్న వీడియోను షేర్ చేసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. నెటిజన్ల రియాక్షన్స్ ఏంటంటే?

సినిమా తారలు తమ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయాలను అందరితో షేర్ చేసుకోవడానికి సోషల్ మీడియాను వినియోగిస్తుంటారు. దీని ద్వారానే అభిమానులకు చేరువగా ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో సినీ తారలు షేర్ చేసే ఫొటోలు, వీడియోలపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తుంటాయి.

Tollywood: టవల్‌తో ఉన్న వీడియోను షేర్ చేసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. నెటిజన్ల రియాక్షన్స్ ఏంటంటే?
Tollywood Heroine
Follow us
Basha Shek

|

Updated on: Mar 21, 2025 | 9:38 AM

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు సినీ తారలు. తమ లేటెస్ట్ ఫొటోస్, వీడియోస్ తో పాటు తమ వ్యక్తిగత విషయాలను అందులో పంచుకుంటున్నారు. వీటి ద్వారానే సినీ ప్రముఖులు అభిమానులకు మరింత దగ్గరవుతుంటారు. అయితే కొన్ని సార్లు సినీ తారలు షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి నెగెటివ్ కామెంట్స్ వస్తుంటాయి. ట్రోలర్స్ కూడా విరుచుకుపడుతుంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది మంగళవారం హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ‘ఆర్‌ఎక్స్-100’ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైందీ అందాల తార. ముఖ్యంగా తన బోల్డ్ యాక్టింగ్ తో కుర్రకారును ఫిదా చేసింది. అయితే ఆ తర్వాత పాయల్ నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. వెంకీ మామ, తీస్ మార్ ఖాన్, డిస్కో రాజా ‘అనగనగా ఓ అతిథి, జిన్నా, రక్షణ తదతర సినిమాలు ఫెయిల్యూర్స్ గా నిలిచిపోయాయి. అయితే పాయల్ చివరిగా నటించిన మంగళవారం మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది పాయల్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఓ వీడియో పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఆమె టవల్ తో దర్శనమిచ్చింది. ఆ వీడియోకి ‘ద రియాల్టీ ఆఫ్ బీయింగ్ ఆన్ యాక్టర్’ అనే క్రేజీ క్యాప్షన్ జోడించింది

పాయల్ రాజ్ పుత్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది క్యూట్ అని కామెంట్స్ చేస్తున్నారు.అదే సమయంలో మరికొందరు నెటిజన్లు పాయల్ ను విమర్శిస్తున్నారు. ‘బట్టలు వేసుకోవడం మర్చిపోయావా తల్లీ’?, ‘ఎందుకీ మేడం ఇలాంటి పనులు’ అంటూ ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ నెగెటివ్ కామెంట్స్ పై పాయల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

పాయల్ రాజ్ పుత్ షేర్ చేసిన వీడియో..

ప్రస్తుతం వెంకటలచ్చిమి అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది పాయల్ రాజ్ పుత్. తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో మొత్తం ఆరు భాష‌ల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!