అలా కాదురా పిచ్చోడా..! రామ్ పక్కన ఉన్న అమ్మాయిని బయట చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి
అఖండ హిట్ తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం స్కంద. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటించగా..ఆయనకు జోడిగా శ్రీలీల కథానాయికగా అలరించింది. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. అప్పుడెప్పుడో పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తర్వాత రామ్ వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్నాడు. తర్వాత వచ్చిన రెడ్ సినిమా కూడా నిరాశపరిచింది. అలాగే బోయపాటి డైరెక్షన్ లో స్కంద అనే సినిమా చేశాడు రామ్. ఈ సినిమాలో రామ్ కు జోడీగా శ్రీలీల కథానాయికగా అలరించింది. బోయపాటి శ్రీను, రామ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. రామ్ కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ చిత్రం రామ్ కెరీర్ లోనే అత్యధికంగా ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
అయితే ఈ సినిమాలో ఓ కొత్తందం తెరపై సందడి చేసింది. ఈ మూవీలో రామ్ పోతినేని చెల్లిగా ఓ అమ్మాయి కనిపించింది. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ఆమె కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆ అమ్మాయి పేరు అమృత చౌదరి. పక్కా తెలుగమ్మాయి. భీమవరంలో జన్మించిన అమృత.. ఇంజనీరింగ్ పూర్తి చేసింది. కాలేజీ డేస్ లోనే యాక్టింగ్ తన టాలెంట్ చూపించింది. ఆ తర్వాత ఇన్ స్టా రీల్స్ ద్వారా ఫేమస్ అయ్యింది.
ఇక పలు షార్ట్ ఫిలింస్, కవర్ సాంగ్స్ లో యాక్ట్ చేసింది. దీంతో అటు సినిమా ట్రయాల్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే స్కంద చిత్రంలో హీరోకు చెల్లిగా నటించే ఛాన్స్ కొట్టేసింది. అలాగే రివైండ్ అనే సినిమాలోనూ నటించింది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటుంది. తన అందచందాలతో కుర్రకారు మతిపోగొడుతోంది ఈ చిన్నది. రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ భామ బెట్టింగ్ యాప్ ప్రమోట్ కేసులో చిక్కుకుంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారి పై పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆ లిస్ట్ లో అమృత చౌదరి పేరు కూడా ఉంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..