కోయ్ కోయ్.. కొత్త హీరోయిన్ దొరికిందిరోయ్..! ప్రగతి కూతురు అందానికి ఎవరైనా పడిపోవాల్సిందే
టాలీవుడ్ సీనియర్ నటీమణి ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం హీరోలు, హీరోయిన్లకైనా అమ్మ, అత్తమ్మ తదితర సహాయక పాత్రలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్. చాలా మంది లాగే హీరోయిన్ గా కెరీర్ ఆరంభించిన ప్రగతి కొన్ని కారణాలతో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే సెకెండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఆమె తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది

సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. వారిలో నటి ప్రగతి ఒకరు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది. విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది సీనియర్ నటి. ప్రగతి ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. ఏమైంది ఈవేళ సినిమాలో ఆమె పోషించిన హీరో తల్లి పాత్రకు ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం లభించింది. ప్రగతి కేవలం నటి మాత్రమే కాదు. 2023లో నిర్వహించిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో ఆమె కాంస్య పతకం సాధించింది. సినిమాల్లో ఎక్కువగా ఆమె హీరోఎం హీరోయిన్స్ తల్లి పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సినిమా ఏదైనా ప్రగతి ఖచ్చితంగా ఉంటారు.
ఇక సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ ప్రగతి చాలా యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ గా ఆమె వర్కౌట్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. వర్కౌట్ వీడియోలతో ఆమె ఎంతో మందికి ఇంస్ప్రెషన్ గా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రగతి కూతురిని ఎప్పుడైనా చూశారా.? ఆమె ఎక్కువగా బయటకు రారు. సినిమా ఫ్యాక్షన్స్ లోనూ ప్రగతి కూతురు కనిపించింది తక్కువే. ఆమె పేరు గీత.
చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్న ప్రగతి. ఆపై ఇద్దరు పిల్లలకు అమ్మగా మారింది. ఆ తర్వాత భర్త నుంచి విడిపోవడంతో ఇద్దరు పిల్లల బాధ్యతను భుజానకెత్తుకుంది. సింగిల్ మదర్ గా ఎన్నో కష్టాలు పడుతూ కొడుకు, కూతుర్లను పెంచి పెద్ద చేసింది. ఇక ప్రగతి కూతురు గీత విషయానికొస్తే అందంలో అచ్చం అమ్మలనే ఉంటుంది ఈ అమ్మడు. అయితే ప్రస్తుతం చదువుపైనే దృష్టి సారించిన గీత ఇండస్ట్రీలోకి వస్తుందో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు మాత్రం ప్రగతి కూతురు ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి