చిరంజీవితో ఉన్న ఈ చిన్నది.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం.!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 156వ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు విశ్వంభర అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీ సోషియో-ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా. ఈ చిత్రానికి “బింబిసార” ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై వి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ ఆషికా రంగనాథ్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఎంతో మంది నటీ నటులతో కలిసి పని చేశారు. అలాగే ఎంతో మంది ఆయన సినిమాల్లో చైల్డ్ ఆరిస్ట్ లుగాను చేశారు. అలాగే పై ఫొటోలో మెగాస్టార్ తో ఉన్న చిన్నది. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఆమె ఎవరో తెలుసా.?
పై ఫొటోలో మెగాస్టార్ చిరంజీవితో ఉన్న చిన్నారి ఎవరో కాదు.. యంగ్ బ్యూటీ నిత్యా శెట్టి. ఈ చిన్నది చిరంజీవి నటించిన అంజి సినిమాలో నటించింది. అంజి సినిమాలో చిరంజీవితో ఉండే చిన్నారుల్లో ఈ అమ్మడు ఒకరు. ఈ ఫోటో అంజి సినిమా సమాయంలోదే.. ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. అప్పటి ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా మారింది. తన అందాలతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన నిత్యా శెట్టి ఆతర్వాత హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది.
నువ్వు తోప్ రా.., పిట్టా కథ వాంటెడ్ పండుగాడు లాంటి సినిమాల్లో నటించింది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. తన అందాలతో కవ్విస్తుంది నిత్యా శెట్టి. క్రేజీ ఫోటోలు, అదిరిపోయే వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది నిత్యా శెట్టి. సోషల్ మీడియాలో ఈ చిన్నది పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అందం అభినయం ఉన్నా ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం పెద్దగా రావడం లేదు. సాలిడ్ ఆఫర్ కోసం ఎదురుచూస్తుంది ఈ అమ్మడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..