AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్.. కెరీర్ క్లోజ్ అయినట్టే అంటున్న ఫ్యాన్స్..

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లి పీటలెక్కుతున్నారు. చాలా మంది యంగ్ హీరోలు, హీరోయిన్స్ పెళ్లిపీటలెక్కుతున్నారు. చాలా మంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నారు. అలాగే ఇంకొంతమంది లవ్ ఎఫర్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. హీరో, హీరోయిన్స్ చాలా మంది ప్రేమలో మునిగితేలుతున్నారు.

ఆ స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్.. కెరీర్ క్లోజ్ అయినట్టే అంటున్న ఫ్యాన్స్..
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 19, 2025 | 12:33 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాలను ప్రారంభిస్తున్నారు. అలాగే కొంతమంది లవ్ ఎఫర్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. చాలా మంది ముద్దుగుమ్మలు ప్రేమలో తేలిపోతున్నారు. కొంతమంది బిజినెస్ మ్యాన్స్ తో ప్రేమాయణం సాగిస్తుంటే మరికొంతమంది మాత్రంతోటి నటులతో ప్రేమలో తేలిపోతున్నారు. అలాగే ఇప్పుడు ఓ క్రేజీ బ్యూటీ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకుంటున్న ఈ బ్యూటీ.. అప్పుడే హీరోతో ప్రేమలో పడటంతో అది కూడా ఓ సీనియర్ హీరోతో ప్రేమాయణం సాగించడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అమ్మడి కెరీర్ ఖతమ్ అవుతుందని కొందరు నెటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఆ యంగ్ బ్యూటీ ఎవరు.? ఆమె ప్రేమించిన సీనియర్ హీరో ఎవరు.? అనేది చూద్దాం.

తెలుగులో ఎంతో మంది హాట్ బ్యూటీలు ఉన్నారు. ప్రస్తుతం దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్స్ వారిలో నిధి అగర్వాల్ ఒకరు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది ఈ వయ్యారి భామ. ఈ ముద్దుగుమ్మ తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది నిధి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత అక్కినేని అఖిల్ తో మజ్ను అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా నిరాశపరిచింది. దాంతో ఈ బ్యూటీకి ఇక అవకాశాలు రావడం కష్టమే అని అనుకున్నారు అంతా.. ఆతర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాలో నటనతో పాటు గ్లామర్ పరంగాను ఆకట్టుకుంది.

డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నిధి అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ సినిమా హిట్ అయినా కూడా నిధికి అంతగా ఆఫర్స్ రాలేదు. మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అశోక్ గల్లా నటించిన హీరో అనే సినిమా చేసింది. ఇక ఇప్పుడు ఈ భామ వరుసగా రెండు భారీ సినిమాలు చేస్తోంది. కెరీర్ ఖతం అయ్యింది అని అనుకునేలోగా ఇద్దరూ బడా స్టార్స్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజా సాబ్ సినిమాలోనూ నటిస్తుంది.  అయితే నిధి అగర్వాల్ తమిళ్ హీరో శింబుతో ప్రేమలో పడిందని ఆమధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో నిధి ఆ రూమర్స్ ను కొట్టిపారేసింది. ఇప్పుడు మరోసారి నిధి శింబు ప్రేమాయణం గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే టి నగర్‌లోని శింబు ఇంటికి మకాం మార్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఇరు కుటుంబాలను ఒప్పించే పనిలో ఉన్నారట. త్వరలోనే వీరి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. శింబు గతంలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ తో లవ్ ఎఫర్స్ నడిపిన విషయం తెలిసిందే.. అయితే శింబుని పెళ్లి చేసుకుంటే కెరీర్ క్లోజ్ అవుతుందని కొందరు ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిధి అగర్వాల్ ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.