AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్, ధనుష్ ఇప్పుడు సూర్య.. ఈ అమ్మడి స్పీడ్ మాములుగా లేదుగా..

కోలీవుడ్ హీరో సూర్యకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తమిళంతోపాటు తెలుగులోనూబ మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డైరెక్టర్ ఆర్జే బాలాజీ దర్శక్తవంలో ఓ భారీ యాక్షన్ అడ్వైంచరస్ మూవీ రూపొందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ త్రిషను ఎంపిక చేశారు.

విజయ్, ధనుష్ ఇప్పుడు సూర్య.. ఈ అమ్మడి స్పీడ్ మాములుగా లేదుగా..
Surya
Rajeev Rayala
|

Updated on: Mar 20, 2025 | 7:47 AM

Share

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన రెట్రో చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తుంది. ఈ చిత్రం మే 1, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత, సూర్య తన 45 చిత్రంలో నటిస్తున్నాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా., త్రిష నటిస్తుంది. సూర్య, త్రిష ఇద్దరూ ఈ సినిమాలో న్యాయవాదులుగా కనిపించనున్నారు. ఆసక్తికర కథతో ఆర్జే బాలాజీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత సూర్య తమిళ చిత్రం వాడివాసల్ లో నటించనున్నాడని తెలిసిందే. వీటితో పాటు లక్కీ భాస్కర్, సార్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేయనున్నారు సూర్య.  ఈ సినిమాకు సంబంధించిన ప్రకటనలు త్వరలో వెలువడతాయని కూడా చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి కొలువుడ్ లో ఆసక్తికర టాక్ నడుస్తుంది. ఇంకా అనౌన్స్ కానీ ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి కూడా ఇప్పుడు టాక్ వినిపిస్తుంది.

ఈ చిత్రంలో నటి మమిత బైజు కూడా ఒక ప్రధాన పాత్రలో నటించనుందని ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వీరిద్దరూ గతంలో దర్శకుడు బాలా దర్శకత్వం వహించిన వనంగాన్ చిత్రంలో నటించారు. కానీ ఆ సినిమా నుంచి అనివార్యకారణాల వల్ల సూర్య, మమిత ఇద్దరూ తప్పుకున్నారు.ఆ  తర్వాత  అరుణ్ విజయ్, రీత నటించారని చెబుతారు. ఈ పరిస్థితిలో, దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించబోయే చిత్రంలో నటి మమితా బైజు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. ఇటీవలే ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ ఈ అమ్మడు ఛాన్స్ అందుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన.. లేటెస్ట్ రిపోర్ట్..
తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన.. లేటెస్ట్ రిపోర్ట్..
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!
విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..
పీఎఫ్ శాలరీ లిమిట్ భారీగా పెంపు.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్..
పీఎఫ్ శాలరీ లిమిట్ భారీగా పెంపు.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్..