నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో
చేపల వేటకని బయలుదేరాడు. తుఫాను దారిని మళ్లించింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన పసిఫిక్ మహాసముద్రంలో కొట్టుకుపోయాడు. ఎటు చూసినా నీళ్లు.. నెల..రెండు నెలలు..మూడు నెలలు.. సముద్రంలోనే జీవితం. సరైన ఆహారం లేదు. మంచి నీరు కూడా లేదు. అయినా బతకాలన్న ఆశ అతడిని ఒడ్డున చేర్చింది. 95 రోజుల తరువాత గస్తీ బృందానికి దొరికాడు. సినిమా స్టోరీని తలపిస్తున్న ఈ కథ..పెరూవియన్ తీరంలో జరిగింది.
పెరూవియన్ తీరంలోని మార్కోనా పట్టణానికి చెందిన మాక్సిమో డిసెంబర్ 7న ఫిషింగ్ కోసం బయలుదేరాడు. రెండు వారాల ట్రిప్. అందుకు తగ్గట్టుగానే ఆహారాన్ని కూడా ప్యాక్ చేసుకున్నాడు. పది రోజుల తరువాత వచ్చిన తుఫాను అతని పడవను దారి మళ్లించడంతో.. పసిఫిక్ మహాసముద్రంలో కొట్టుకుపోయాడు. అతని కుటుంబం, పెరూ సముద్ర గస్తీ దళాలు వెదకడం మొదలెట్టాయి. మరోవైపు నట్ట నడి సముద్రంలో తప్పిపోయిన మాక్సిమోకు ఎటు చూసినా నీళ్లు. కుటుంబంపైనే ధ్యాస.. తన తల్లి గురించి, నెలల వయసున్న మనవరాలి గురించిన ఆలోచనలే. అవే ఆయన జీవితంపై ఆశను రేఖెత్తించాయి.. ఎలాగైనా బతికి ఒడ్డుకు చేరాలన్న స్ఫూర్తిని ఇచ్చాయి. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని తాగాడు. బతకడం కోసం కీటకాలు, పక్షులు, తాబేలును తిన్నాడు. ఎవరో ఒకరు కనిపెట్టేవరకూ తాను బతికుండాలన్న ఆశ అతని ప్రాణాలను నిటబెట్టింది.
మరిన్ని వీడియోల కోసం :
గదిలో ఒంటరిగా ఉండటం చాలా కష్టం వీడియో
తాచుపాము కరిచినా…10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో