Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రో.. నీ ఐడియా సూపర్‌..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్‌..వీడియో

Samatha J

|

Updated on: Mar 23, 2025 | 1:20 PM

తెలివితేటలకి చదువుకి సంబంధం ఉండదు. కొందరు తమ బుద్ధిబలంతో కొత్త కొత్త ఆవిష్రణలు చేస్తుంటారు. ఇలాంటి జుగాడ్‌లు సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటాం. ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు ఇండియన్స్‌కే వస్తాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్‌ మీడియాలోవైరల్‌ అవుతోంది. ఓ వ్యక్తి తన వద్ద వాటర్‌ డిస్పెన్సర్‌ లేకపోవడంతో అంత పెద్ద క్యాను నుంచి ప్రతిసారీ నీళ్లు గ్లాసులోకి వంపుకోవడం కష్టంగామారింది. దీంతో అతనికి ఒక ఐడియా వచ్చింది. వెంటనే అమలు చేసేసాడు.

ఆదివాసీలు వెదురు బొంగుల్లో నీళ్లు తాగడం గుర్తుకొచ్చింది. వెంటనే అతని ఇంట్లో ఉన్న ఒక వెదురు బొంగును ఓ చోట పాతి దానికి ఇంట్లో నిరుపయోగంగా ఉన్న ఓ ట్యాప్‌ను తెచ్చి అమర్చాడు. దానిపైన వాటర్‌ క్యాన్‌ను ఉంచాడు. అతని దగ్గరవాటర్ డిన్సెన్షనర్ లేకపోవడంతో ఓ వ్యక్తి వెదురు బొంగును డిన్సెన్షనర్‌గా మార్చేశాడు. ట్యాప్ తిప్పగానే వెదురు బొంగులో నుంచి నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయి. బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి ఇలా వెదురు బొంగుతో ప్రయోగం చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటికే పది లక్షలమందికి పైగా వీక్షించారు. లక్షన్నరమందికి పైగా వీడియోను లైక్ చేసి ప్రశంసించారు. వీళ్ల తెలివితేటల ముందు ఇంజనీర్లుకూడా పనికి రారని కామెంట్లు చేస్తున్నారు

మరిన్ని వీడియోల కోసం :

గదిలో ఒంటరిగా ఉండటం చాలా కష్టం వీడియో

తాచుపాము కరిచినా…10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

ఈ కోతికి ఫోన్‌ కనిపిస్తే చాలు.. వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో