ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో
వేసవి తాపం అప్పుడే ప్రభావం చూపుతోంది. మరి దీనినుంచి ఉపశమనం పొందడానికి మనుషులకైతే వివిధ ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు ద్వారా సేదతీరుతారు. మరి మూగజీవుల పరిస్థితి ఏంటి? చెట్లు, చేమలు, నీటిగుంటలను ఆశ్రయిస్తాయి. కానీ వనాల్లోనూ నీరు, ఆహారం దొరకని పరిస్థితి. అందుకే వన్యప్రాణులు జనావాసాల్లోకి చేరుతున్నాయి. ఇటీవల పాములు తరచూ ఇళ్లలోకి చొరబడుతున్నాయి. ఏసీలు, వాహనాలు ఇలా ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తున్నాయి.
తాజాగా ఓ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేసవి తాపాన్ని తట్టుకోలేపోయిన ఓ పాము చేసిన పనికి అంతా అయ్యోపాపం ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియోలో ఓ పాము నీటిపంపుకింద స్నానం చేస్తోంది. వేసవితాపంతో అల్లాడిపోయిన ఆ పాము..ఒక హ్యండ్ బోర్ వద్దకు చేరుకుంది. అక్కడ బోర్ కింద పడగవిప్పి కూర్చుంది. కానీ నీళ్లు రావడంలేదు. దీనంగా అక్కడే ఉండి నిస్సహాయంగా చుట్టూ చూస్తోంది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి పాము పరిస్థితిని అర్థం చేసుకొని పంపు కొట్టాడు. దాంతో నీళ్లు దారగా పాము పడగపై పడుతుంటే ఎంతో సేదతీరింది. మరోవ్యక్తి పామును కర్ర సాయంతో పంపుకిందకు వెళ్లేలా చేశాడు. అయితే నాగుపాము వారికి ఎలాంటి హానీ తలపెట్టలేదు. తనకు సాయం చేసిన వారివైపు కృతజ్ఞతగా చూసి అక్కడినుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు.
మరిన్ని వీడియోల కోసం :
గదిలో ఒంటరిగా ఉండటం చాలా కష్టం వీడియో
తాచుపాము కరిచినా…10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో