మహానగరానికి ముంచుకొచ్చిన ముప్పు..వీడియో
హైదరాబాద్‌కు భూగర్భజల నీటి కరువు ముప్పు ముంచుకొచ్చింది. అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ మహానగరంలో అంతకు రెట్టింపు స్థాయిలో భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతున్నాయి. తాజా సర్వేనే అందుకు నిదర్శనం. ఔటర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 948 చదరపు కిలోమీటర్లలో సాంకేతిక నిపుణులతో జలమండలి జరిపిన సర్వేలో కేవలం 27 చదరపు కిలోమీటర్లు మినహా, మిగిలిన 921 చదరపు కిలోమీటర్లలో భూగర్భ జలాలు ప్రమాద స్థాయిలో అడుగంటిపోయినట్లు నివేదిక సమర్పించారు.
హైటెక్ సిటీ మాదాపూర్ శేరిలింగంపల్లి కూకట్పల్లి మిగతా 15 డివిజన్లో అత్యధికంగా నాలుగు లక్షల 50 వాటర్ ట్యాంకులు జలమందలి నుంచి రిపీటెడ్ గా 22,000 మంది బుక్ చేసుకున్నట్లుగా రికార్డులు బయటపడ్డాయి. విచిత్రంగా హైదరాబాద్ చరిత్రలోనే ఎన్నడు లేని విధంగా వాటర్ ట్యాంకులు రిపీటెడ్ గా బుక్ కావడం పట్ల అధికారులు గ్రౌండ్లలో గ్రౌండ్ వాటర్ పై సర్వేలు చేశారు. దీంతో ఈ వాస్తవాలు బయటపడ్డాయి. హైటెక్‌సిటీ ఏరియాలోని ఐక్యా చుట్టూ దాదాపు 5 కిలోమీటర్ల రేడియస్ లో ఎక్కడ కూడా వర్షం నీళ్లు ఇంకే పరిస్థితి దాదాపుగా లేనట్టుగా అధికారులు గుర్తించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది వర్షపాతం అధికంగా నమోదైనప్పటికీ ఎక్కడ కూడా వర్షం నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేకుండా సిమెంట్ టాపింగ్ చేయడం ఇంకుడు గుంతలు వంటివి లేకపోవడంతో పడిన వర్షం నీరు అంతా మూసీ నదిలోకి డ్రైనేజీ రూపంలో వెళ్ళిపోతున్నట్లుగా గుర్తించారు.
మరిన్ని వీడియోల కోసం :
గదిలో ఒంటరిగా ఉండటం చాలా కష్టం వీడియో
తాచుపాము కరిచినా…10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో