ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఆయనకి ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
నటుడుగా, దర్శకుడుగా, గీత రచయితగా, నిర్మాతగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి పేరు సంపాదించాడు కోలీవుడ్ స్టార్ ధనుష్.
అసలు ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు. సినిమాల్లోకి అడుగు పెట్టక ధనుష్‌గా పేరు మార్చుకున్నాడు.. మొదట్లో ధనుష్ కు నటుడు అవ్వాలనే కొరికే లేదట.
తొలుత అనేక విమర్శలపాలైన ధనుష్ అక్కడి నుండి జాతీయ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగారు.. ఒక్కో మెట్టు ఎక్కుతూ కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్‌లలో పేరు తెచ్చుకున్నారు.
ధనుష్ సినిమా జీవితానికి ఆయన సోదరుడు సెల్వరాఘవన్ దర్శకుడు కావడం ఎంతో ఉపయోగపడింది. ధనుష్ తుళ్లువదో ఇలామై సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు.
తరువాత నెమ్మదిగా అనేక భాషలో నటించగా.. 'రాంఝనా' సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి.. 'ఫకీర్' సినిమా ద్వారా హాలీవుడ్ నటుడయ్యారు.
అయితే ఆస్తుల వివరాల్లోకి వెళ్తే చెన్నైలోని పోయస్ గార్డెన్‌లో 150 కోట్ల రూపాయల విలువైన బంగ్లా ఉంది. దాదాపు ధనుష్ కు 230 కోట్ల రూపాయలు వరకు ఆస్తి ఉందట.
అయితే గతంలో నయనతార దగ్గర 3 సెకన్ల వీడియో కోసం 10 కోట్లు అడిగాతతో.. ఆమె కేసు పెట్టింది. కోర్ట్ కూడా ఇటీవల ధనుష్‌కి ఫేవర్‌గా తీర్పు ఇచ్చింది.