Boyapati Srinu: మరో హీరోను విలన్‌గా మార్చనున్న మాస్ డైరెక్టర్.. రామ్ సినిమా కోసం

ఈ మధ్య వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు.. అలాగే ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి. ప్రస్తుతం యంగ్ హీరో రామ్ పోతినేనిని డైరెక్ట్ చేస్తున్నారు బోయపాటి.

Boyapati Srinu: మరో హీరోను విలన్‌గా మార్చనున్న మాస్ డైరెక్టర్.. రామ్ సినిమా కోసం
Boyapati Srinu
Follow us

|

Updated on: Feb 01, 2023 | 10:45 AM

స్టార్ డైరెక్టర్ లో బోయపాటి శ్రీను స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మాస్ సినిమాలకు బోయపాటి పెట్టింది పేరు. బోయపాటి సినిమాలు అంటే భారీ హిట్ ఖాయం. ఆయన దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఈ మధ్య వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు.. అలాగే ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి. ప్రస్తుతం యంగ్ హీరో రామ్ పోతినేనిని డైరెక్ట్ చేస్తున్నారు బోయపాటి. రామ్ చివరిగా లింగుస్వామి దర్శకత్వంలో వారియర్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కెరీర్ లో మొదటి సారి పోలీస్ పాత్రలో నటించాడు రామ్.

ఇక ఇప్పుడు రామ్ తో ఊర మాస్ మసాలా మూవీ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు బోయపాటి శ్రీను. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఇదిలా ఉంటే తాజాగా రామ్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గడ్డం తో చాలా రఫ్ గా కనిపిస్తున్నాడు రామ్.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా ఓ హీరో నటించనున్నాడట. బోయపాటి సినిమాల్లో విలన్ పాత్రలను చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇందుకోసం ఆయన సీనియర్ హీరోలను ఎంచుకుంటూ ఉంటారు. లెజెండ్ సినిమాలో జగపతి బాబును, అఖండ సినిమాలో శ్రీకాంత్ ను విలన్ గా మార్చారు బోయపాటి. ఇప్పుడు రామ్ సినిమా కోసం కూడా ఓ హీరోతో విలన్ వేషం వేయించనున్నారట. అత్యంత భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తుండగా ప్రిన్స్ ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపించనున్నాడట. ప్రిన్స్ ను పవర్ ఫుల్ గా బోయపాటి శ్రీను చూపించనున్నారని తెలుస్తోంది.