Prasanth Varma: మరో సరికొత్త జోనర్ లో ప్రశాంత్ వర్మ సినిమా.. తెలుగులో తొలి ఒరిజినల్ సూపర్ హీరో కథతో మూవీ…
యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటించిన కల్కీ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఆతర్వాత హీరో నాని నిర్మించిన అ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఈ యంగ్ దర్శకుడు.
prashanth varma : హీరో నాని నిర్మించిన ‘అ’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన అ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటించిన ‘కల్కి’ సినిమాతో దర్శకుడిగా మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ప్రశాంత్ వర్మ జాంబీ రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు తెరపై ఇంతవరకు ఎవ్వరూ ప్రయత్నించని జోనర్ లో సినిమా తెరకెక్కించి శబాష్ అనిపించుకున్నాడు. చాలా చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న తేజ సజ్జ హీరోగా నటించిన జాంబీరెడ్డి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఇప్పుడు జాంబీరెడ్డి సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక జోనర్ కు మరో జోనర్ సంబంధం లేని కథలను ఆయన ఎంచుకుంటూ ముందుకు ఇదిలా ఉంటే తన కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసాడు ప్రశాంత్ వర్మ.
తెలుగులో ఇదే మొట్టమొదటి ఒరిజినల్ సూపర్ హీరో తెలుగు ఫిలిం అని ప్రశాంత్ వర్మ టీమ్ ప్రకటించింది. `హను-మాన్` అనేది టైటిల్. 29మే ప్రశాంత్ వర్మ పుట్టినరోజున సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేసారు. అయితే కథ .. కాన్సెప్ట్ ఎలా ఉంటాయనే విషయాన్ని ఆయన సస్పెన్స్ లోనే ఉంచాడు. హనుమాన్ భారతీయ పురాణాల నుండి ప్రేరణ పొందిన కథతో రూపొందనుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :