Chiranjeevi Oxygen Bank: విజయవంతంగా కొనసాగుతున్న చిరంజీవి ఆక్సిజన్ సిలిండ‌ర్ల‌ పంపిణి… సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన మెగాస్టార్

నిన్న మొన్నటి వరకు బ్లడ్‌ బ్యాంక్‌తో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన చిరంజీవి.. ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంక్ తో కరోనా బాధతులకు ఊపిరి అందించనున్నారు.

Chiranjeevi Oxygen Bank: విజయవంతంగా కొనసాగుతున్న చిరంజీవి ఆక్సిజన్ సిలిండ‌ర్ల‌ పంపిణి... సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన మెగాస్టార్
Follow us
Rajeev Rayala

|

Updated on: May 29, 2021 | 11:18 AM

నిన్న మొన్నటి వరకు బ్లడ్‌ బ్యాంక్‌తో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన చిరంజీవి.. ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంక్ తో కరోనా బాధతులకు ఊపిరి అందించనున్నారు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి జిల్లా అభిమాన సంఘాల ఆధ్వ‌ర్యంలో ఆయా జిల్లాల్లో ఈ ఆక్సిజ‌న్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఏపీ, తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో ఈ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు తెలంగాణలో జిల్లాలైన ఖమ్మం, కరీంనగర్‌లలో  పూర్తి స్థాయిలో ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభించారు. ఇక ఆక్సిజ‌న్ కావాల‌ని కోరే.. ఆసుపత్రి సిబ్బందికి.. వారి అవసరాన్ని బట్టి ఈ బ్యాంకు సభ్యులు ఆక్సిజన్‌ సిలిండ‌ర్ల‌ను అందించనున్నారు. తాజాగా శ్రీకాకుళం , విజయనగరం, విశాఖపట్నం, మహబూబ్ నగర్, కర్నూల్ లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు నుంచి సిలిండర్లను పంపిణి చేశారు.

ఇక ఇటీవల కార్య‌క్ర‌మం ప్రారంభం సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ -“చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో నిరంత‌రాయంగా ఆక్సిజ‌న్ పంపిణీ కొనసాగుతుంది. చైనా నుంచి ఆక్సిజ‌న్ కాన్స‌న్ ట్రేట‌ర్లు ఆర్డ‌ర్ చేశాం. ప్ర‌స్తుతం చాలా చోట్ల వీటి కొరత ఉంది. అత్యవసరంగా ఎక్క‌డ అవ‌స‌రం ఉంది అనేది తెలుసుకొని ఆక్సిజ‌న్ సిలిండర్లు అందిస్తున్నాం. ఇది స‌ద్వినియోగం కావాల‌నే మా ప్ర‌య‌త్నమని” అన్నారు. ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇంత వేగంగా ప్రారంభించామని ఆయన చెప్పారు. చివరగా రామ్ చ‌ర‌ణ్ స్వయంగా ఈ ఏర్పాట్ల‌న్నీ చూస్తున్నారు అని చెప్పారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను షేర్ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sarkaru Vaari Paata: మహేష్ నోటా మాస్ డైలాగ్స్ … ‘సర్కారు వారి పాట’లో సరికొత్తగా సూపర్ స్టార్..