Evaru Meelo Koteeswarulu: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్‌కు బ్రేక్ పడినట్లేనా.?
కొద్ది రోజుల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే రియాలిటీ షోను గ్రాండ్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే..
కొద్ది రోజుల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే రియాలిటీ షోను గ్రాండ్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రోగ్రాం మే చివరివారం నుంచి ప్రసారం కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ షో వాయిదా పడింది. ఇక తాజాగా ఈ షో తిరిగి పున: ప్రారంభమయ్యేది ఎప్పుడు.? అనే దానిపై పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కరోనా ప్రభావం తగ్గినట్లయితే.. ఈ షో ఆగష్టు నుంచి టెలికాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని.. ఒకవేళ కరోనా కేసులు తగ్గకపోతే ఈ ఏడాది షో పూర్తిగా లేనట్లేనని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉండగా.. ఈ సినిమా పూర్తయిన తర్వాత దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా.. అనంతరం ‘కేజీఎఫ్’ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో సినిమా చేయనున్నాడు.
Also Read:
మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?
టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?
సర్కస్ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!