AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Faria Abdullah: తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న లేడీ జాతిరత్నం.. యంగ్ హీరోకు జోడీగా ఫారియా అబ్దుల్లా..

ఆమె నవ్వు.. కుర్రాళ్ల గుండెల్లో లక్ష్మీ బాంబును పేల్చింది. అమాయకంగా చూసే ఆ చిట్టి చూపులు.. బాడీని మెలికలు తిప్పేలా చేసింది.

Faria Abdullah: తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న లేడీ జాతిరత్నం.. యంగ్ హీరోకు జోడీగా ఫారియా అబ్దుల్లా..
Rajeev Rayala
|

Updated on: May 29, 2021 | 11:29 AM

Share

Faria Abdullah: ఆమె నవ్వు.. కుర్రాళ్ల గుండెల్లో లక్ష్మీ బాంబును పేల్చింది. అమాయకంగా చూసే ఆ చిట్టి చూపులు.. బాడీని మెలికలు తిప్పేలా చేసింది. ఆ ఫేస్.. క్లాస్ , మాస్ అనే తేడా లేకుండా.. అందరినీ తనవైపు తిప్పుకునేలా చేసింది. ఆమె ఎవరోకాదు తెలుగు తెరపై ఆరడుగుల అందం.. హైదరాబాదీ జాతిరత్నం..  టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్షేషన్.. ఫారియా అబ్దుల్లా. జాతిరత్నాలు మూవీతో తెలుగుతెరకు పరిచయం అయిన ఈ ఆరడుగుల అందాన్ని.. ప్రస్తుతం జనరేషన్ ఎవరూ అంత సులువుగా మరిచిపోలేరు.  ఫస్ట్ మూవీలోనే తన క్యూట్ స్మైల్, అట్రాక్టివ్ ఫేస్ తో.. యూత్ లో గిలిగింతలు పెట్టింది. హైదరాబాద్ లో జన్మించిన ఫారియా అబ్దుల్లాకు.. చిన్ననాటి నుంచి కళలంటే ఆసక్తి. స్కూల్ కు వెళ్లే సమయంలోనే పెయింటింగ్, డ్యాన్స్, యాక్టింగ్ వంటివి నేర్చుకుంది. ఆ తర్వాత నాటకాలు కూడా వేసి.. నటనలో తనను తాను మెరుగుపర్చుకుంది. లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేసిన ఫారియా అబ్దుల్లా.. మొదట్లో మోడలింగ్ తో పాటు.. యూ ట్యూబర్ గా పాప్యులర్ అయ్యింది. థియేటర్ అర్టిస్ట్ గా కూడా పనిచేసింది.

నక్షత్ర అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఆ తర్వాత జాతిరత్నాలులో అవకాశం రావడంతో.. ఎక్కడా లేని క్రేజ్ ఆమె సొంతమైంది. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగుతో పాటు.. సౌత్, నార్త్ లోనూ మూవీస్ చేసేందుకు సిద్ధమని చెబుతున్న ఫారియా అబ్దుల్లా.. నటనకు ప్రాధాన్యం ఉంటనే ప్రాజెక్టును ఒప్పుకుంటానని చెబుతోంది. సినిమాల్లో ఇలాగే కొనసాగితే.. ఏదో ఒకరోజు డైరెక్షన్ కూడా చేస్తానని తన మనస్సులోని మాటను బయటపెట్టింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. ఇప్పటికే రవితేజ నటింస్తున్న ఓ సినిమాలో అవకాశం దక్కించుకున్న ఈ లేడీ జాతిరత్నం ఇప్పుడు యంగ్ హీరో యంగ్ హీరో నితిన్ తో జత కట్టడానికి సిద్దమైందని టాక్ వినిపిస్తుంది. నితిన్ నటిస్తున్న ఓ సినిమా హీరోయిన్ గా ఫారియా అబ్దుల్లా ఎంపిక అయ్యిందని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న గుసగుస.  ఇక నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలుతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే చెక్ , రంగ్ దే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హ్యాండ్సమ్ హీరో. త్వరలో మ్యాస్ట్రో సినిమాతో పాటు మరో రెండు సినిమాలను కూడా పట్టాలెక్కించనున్నాడు. వాటిలో ఒక సినిమాలో ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sarkaru Vaari Paata: మహేష్ నోటా మాస్ డైలాగ్స్ … ‘సర్కారు వారి పాట’లో సరికొత్తగా సూపర్ స్టార్..

Ravi Teja: మాస్ రాజాకు జోడీగా ధనుష్ హీరోయిన్.. రవితేజ కొత్తసినిమాలో రజీషా విజయన్