AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja: మాస్ రాజాకు జోడీగా ధనుష్ హీరోయిన్.. రవితేజ కొత్తసినిమాలో రజీషా విజయన్

సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అయితే చాలు.. ఆ తర్వాతి ఛాన్స్ తానే ఇచ్చేస్తాడు.. రవితేజ. అది ఏ ఇండస్ట్రీ అయినా.. కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందా.. సెకండ్ ఛాయిస్ తానే అవుతాడు.

Ravi Teja: మాస్ రాజాకు జోడీగా ధనుష్ హీరోయిన్.. రవితేజ కొత్తసినిమాలో రజీషా విజయన్
Ravi Teja
Rajeev Rayala
|

Updated on: May 29, 2021 | 9:52 AM

Share

Ravi Teja: సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అయితే చాలు.. ఆ తర్వాతి ఛాన్స్ తానే ఇచ్చేస్తాడు.. రవితేజ. అది ఏ ఇండస్ట్రీ అయినా.. కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందా.. సెకండ్ ఛాయిస్ తానే అవుతాడు. ఇప్పటికే చాలామంది న్యూ హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన ఈ ఖిలాడి.. లేటెస్ట్ గా మరో ఇద్దరి భామలకు అవకాశం ఇస్తున్నాడు. మరి ఎవరా ఇద్దరు హీరోయిన్లు..? క్రాక్ హిట్ తో ఈ ఇయర్ ను స్టార్ట్ చేసిన రవితేజ.. ప్రస్తుతం రమేశ్ వర్మ డైరెక్షన్ లోఖిలాడి మూవీ చేస్తున్నాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం విడుదల ఆగిపోయింది. అయితే ఈ సమయంలో మరో కొత్త మూవీ అనౌన్స్ చేశాడు.. మాస్ మహారాజా. శరత్ మండవల అనే కొత్త కుర్రాడి డైరెక్షన్ లో మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ కాంబోలో నిజ జీవిత ఘటనల ఆధారంగా ఓ థ్రిల్లర్ మూవీ ప్లాన్ చేశారు. అయితే ఇందులో హీరోయిన్ గా కేరళ కుట్టిని తెలుగు తెరపై పరిచయం చేయబోతున్నారు. ఇటీవల తమిళనాట అత్యంత ఆసక్తిరేపిన కర్ణన్ మూవీలో హీరోయిన్ గా చేసిన రజీషా విజయన్ ను.. రవితేజ మూవీలో తీసుకోవాలని అనుకుంటున్నారట.

గతంలో చాలా సినిమాల్లో నటించిన రజీషా.. కర్ణన్ తోనే పాప్యులర్ అయ్యింది. దీంతో ఆమెను తెలుగు తెరపై పరిచయం చేయాలని నిర్ణయానికి వచ్చారట. అందుకు ఆమె కూడా పాజిటివ్ గానే రెస్పాన్స్ ఇచ్చిందని తెలుస్తుంది. టాలీవుడ్ మార్కెట్ దృష్ట్యా ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఇదే సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా.. దివ్యాంశ కౌషిక్ ను తీసుకోవాలని కూడా అనుకుంటున్నారట. నాగచైతన్యతో మజిలీ మూవీలో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మను కూడా సంప్రదించారట. ఇలా వరుసగా కొత్త హీరోయిన్లకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్న రవితేజ.. తన లేటెస్ట్ ఫిల్మ్ ఖిలాడీలో ఉన్న ఇద్దరు హీరోయిన్లు కూడా టాలీవుడ్ కు కొత్తవాళ్లే కావడం.. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం.

మరిన్ని ఇక్కడ చదవండి :

రాజమౌళి రికార్డులు చెరిపేసే ద‌మ్ము పవన్ కల్యాణ్ కి మాత్రమే ఉంది అంటున్న పవర్ స్టార్ ఫాన్స్…

Tamil Actress Chandini: ఐదేళ్లుగా సహాజీవనం.. అవసరం తీరాక దూరం.. మాజీ మంత్రిపై వర్థనమాన నటి సంచలన ఆరోపణలు..!