A. M. Rathnam: “తగ్గేదేలే”…హరిహర వీరమల్లు సినిమాపై క్లియర్‌ కట్‌గా క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో హరి హర వీరమల్లుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా  అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

A. M. Rathnam: తగ్గేదేలే...హరిహర వీరమల్లు సినిమాపై క్లియర్‌ కట్‌గా క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 29, 2021 | 1:25 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో హరి హర వీరమల్లుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా  అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై రోజూ రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  ప్రొడ్యూసర్‌ ఏఎమ్ రత్నం చేతులెత్తేశారు..!  పవన్‌ పాన్ ఇండియా మూవీ ఇక ఆగిపోయినట్టే..! బడ్జెట్ తగ్గించాలని క్రిష్‌ మీద ఒత్తిడి పెడుతున్న ప్రొడ్యూసర్‌ ఏఎమ్ రత్నం..! అంటూ సోషల్ మీడియాలో రీసెంట్ గా వస్తున్న రూమర్స్‌కు చెక్‌ పెట్టారు ఏమ్‌ రత్నం. తాజాగా హరిహర వీరమల్లు సినిమాపై క్లియర్‌ కట్‌గా క్లారిటీ ఇచ్చారు. పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పవన్‌ కెరీర్‌లోనే భారీ సినిమా అవుతుందని ఎమ్ రత్నం అన్నారు. గత నెల ఆరో తేదీ వరకూ చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా.. ఆ తర్వాత పవన్‌ కరోనా బారిన పడిన కారణంగా ఆగిపోయందని ఆయన చెప్పారు.

పవన్‌ కోలుకున్నప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ చేయలేక పోయామని రత్నం అన్నారు. లాక్‌డౌన్‌ ముగియగానే.. మరో షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసి పవన్‌, జాక్వలైన్‌, అర్జున్‌ రాంపాల్‌ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నామని ఆయన వివరించారు. 17వ శతాబ్ధంలో సాగే చిత్రం కావడంతో ఎక్కువశాతం సెట్స్‌లోనే షూటింగ్‌ జరుగనుందని.. రాజీవన్‌ అద్భుతమైన సెట్లు సిద్ధం చేశారని ఎఎమ్ రత్నం చెప్పారు. “ఇప్పటికే 50 శాతం పూర్తయింది. నాకు సినిమా తీయడం తప్ప ఇంత బడ్జెట్‌ అయింది.. అంత అయింది అని లెక్కలేసుకోనని” ఆయన చెప్పారు. కథ లాక్‌ అయిన రోజే ఈ సినిమాకు భారీ బడ్జెట్‌ అవుతుందని ఊహించానని… అంతే గ్రాండియర్‌గా సినిమా కూడా తెరకెక్కిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సినిమాతో పాటు “అయ్యప్పన్‌ కోషియుమ్‌” సినిమా షూటింగ్‌ కూడా ఓకే సారి జరుగుతాయని ఏఎమ్‌ రత్నం అన్నారు. ఇక పవన్‌ వీరమల్లు సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేయడానికి ట్రై చేస్తున్నామని ఆయన క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Faria Abdullah: తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న లేడీ జాతిరత్నం.. యంగ్ హీరోకు జోడీగా ఫారియా అబ్దుల్లా..

Chiranjeevi Oxygen Bank: విజయవంతంగా కొనసాగుతున్న చిరంజీవి ఆక్సిజన్ సిలిండ‌ర్ల‌ పంపిణి… సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన మెగాస్టార్