పేరుతో ప్రశాంతత ఉంది కానీ.. ఆయన సినిమాల్లో మాత్రం ఉండేదంతా రక్తపాతమే. కేజియఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయారు ప్రశాంత్ నీల్. ఈ రెండు సినిమాలు 1600 కోట్లకు పైగా వసూలు చేసాయి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ సినిమాతో బిజీగా ఉన్నారు ఈ దర్శకుడు. ఈ చిత్ర షూటింగ్ 70 శాతం పూర్తైంది. సెప్టెంబర్‌లో విడుదల కానుంది సినిమా.
ఓ వైపు సలార్ ఇంకా పూర్తి కాకుండానే.. ప్రశాంత్ నీల్ కోసం హీరోలు క్యూలో ఉన్నారు. ఈయన నెక్ట్స్ సినిమా జూనియర్ ఎన్టీఆర్‌తో ఉండబోతుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ NTR31ను నిర్మించబోతున్నాయి. 2024లో తారక్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. దీని తర్వాత రామ్ చరణ్ చిత్రం లైన్‌లో ఉంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించే అవకాశాలున్నాయి. ఇప్పటికే లైన్ కూడా సిద్ధం చేసారు ప్రశాంత్ నీల్.
రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌పై ఇదివరకే అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. ఇక హోంబళే ఫిల్మ్స్‌లో మహేష్ బాబుతోనూ ప్రశాంత్ సినిమా ఉండబోతుంది. రాజమౌళి తర్వాతే ఈ ప్రాజెక్ట్‌కు ఉండే ఛాన్స్ ఉంది. ఇవన్నీ లైన్‌లో ఉండగానే ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్‌లో మరో సినిమా అనౌన్స్ చేసారు దిల్ రాజు. మొత్తానికి 2026 వరకు ప్రశాంత్ డైరీ ఫుల్ అయిపోయింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.