హిట్టుకొట్టిన కనిపించని ముద్దుగుమ్మ.. ప్రియాంక మోహన్ ఆస్తులు ఎంతంటే

Rajitha Chanti

Pic credit - Instagram

19 January 2026

దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ప్రియాంక అరుళ్ మోహన్. తక్కువ సమయంలోనే తెలుగు, తమిళం భాషలలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. 

ఇటీవలే పవన్ కల్యాణ్ సరసన ఓజీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ సూపర్ హిట్ అయినప్పటికీ తెలుగులో ప్రియాంకకు అంతగా ఆఫర్స్ రావడం లేదు.

 ప్రియాంక 1995 నవంబర్ 20న బెంగుళూరులో జన్మించింది. 2019లో సంకలనం ఓంధ్ కథే హెల్లా సినిమాతో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు.

 అదే సంవత్సరం నానితో కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 2021లో శివకార్తికేయన్ జోడిగా డాక్టర్ సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

తెలుగు, తమిళం, కన్నడ భాషలలో వరుస సినిమాలతో అలరించింది ప్రియాంక. కానీ ఆమెకు బ్రేక్ ఇచ్చిన మూవీ మాత్రం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా మాత్రమే.

నివేదికల ప్రకారం ప్రియాంక ఆస్తులు రూ.10 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. మోడలింగ్, నటనతోపాటు బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా డబ్బు సంపాదిస్తుందని టాక్.

ప్రియాంక వద్ద ఆడి క్యూ3, టయోటా, ఇన్నోవా, క్రిస్టా వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అలాగే ఆమె తన ఫిట్నెస్ విషయంలో యోగా, పైలేట్స్ వంటివి చేస్తుందని టాక్.

 ప్రియాంక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అలాగే ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో సరైన ఛాన్స్ కోసం చూస్తుంది.