AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Appu : ఏంటీ.. హ్యాపీడేస్ అప్పు తల్లి ఆ టాలీవుడ్ నటి ఆ.. ? కూతురు గురించి ఏం చెప్పిందంటే..

దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన విజయవంతమైన చిత్రం హ్యాపీ డేస్లో అప్పు పాత్రకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. అప్పట్లో ఆమె పాత్రను యూత్ ఎక్కువగా ఇష్టపడ్డారు. ఇందులో అప్పు పాత్రలో గాయత్రి రావు జీవించేశారు. కానీ మీకు తెలుసా.. ? అప్పు మదర్ కూడా తెలుగులో పాపులర్నట. హ్యాపీడేస్ సినిమాలోనూ నటించింది.

Appu : ఏంటీ.. హ్యాపీడేస్ అప్పు తల్లి ఆ టాలీవుడ్ నటి ఆ.. ? కూతురు గురించి ఏం చెప్పిందంటే..
Appu
Rajitha Chanti
|

Updated on: Jan 19, 2026 | 2:13 PM

Share

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ సినిమా అప్పట్లో ఓ సంచలనం. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 2007లోనే దాదాపు 23 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో వరుణ్ సందేశ్, నిఖిల్, రాహుల్, తమన్నా, గాయత్రి రావు ఇంకా చాలా మంది ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా నిఖిల్ స్నేహితురాలు అప్పు పాత్రకు సేపరెట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఈ పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఈ పాత్రలో గాయత్రి రావు నటించింది. తాజాగా ఆమె తల్లి బెంగుళూరు పద్మ తన కూతురు గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సినిమా షూటింగ్ మొదటి రోజు తన కుమార్తె గాయత్రి (అప్పు)కు కూడా తొలి రోజు కావడంతో తాను ఒప్పుకున్నట్లు తెలిపారు. అప్పు ప్రస్తుతం వివాహమై, సంతోషంగా ఉందని, పిల్లలు సంతోషంగా ఉంటేనే తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారని పేర్కొన్నారు.

ఈ అవకాశం గురించి వారికి మొదట తెలియదని, ఆఫీస్‌కు వెళ్ళినప్పుడు గాయత్రికి ఆడిషన్స్ జరిగాయని పద్మ చెప్పారు. తమన్నా తండ్రి పాత్రను పద్మ గారి భర్త పోషించారు. దర్శకుడు టీమ్ ప్రతి రోజు నటీనటులను పిలిచి, డైలాగ్స్ చదివిస్తూ అందరి మధ్య ఒక రాపోను ఏర్పరచుకునే ప్రయత్నం చేసిందని అన్నారు. అప్పటికి కూడా అప్పు పాత్రకు గాయత్రినే ఎంపిక చేశారని అధికారికంగా చెప్పలేగని. డైలాగ్స్ ప్రాక్టీస్ చేయిస్తూ, చివరకు అప్పు పాత్రకు గాయత్రిని డిసైడ్ చేసిన తర్వాత, మేక్ఓవర్ కోసం ఆమెను పార్లర్‌కు తీసుకెళ్లారని తెలిపింది.

ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‏కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‏తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..

ఈ సందర్భంగా తన భర్త క్యారెక్టర్ వివరాలు అడగ్గా, అది టామ్ బాయ్ అప్పు అని తెలిసింది. గాయత్రికి అప్పటికి పొడవాటి జుట్టు ఉండేది. పాత్ర డిమాండ్‌కు అనుగుణంగా బాయ్ కట్ చేయాలని పద్మ భర్త సూచించగా, శేఖర్ మొదట షోల్డర్ లెంగ్త్ సరిపోతుందని అన్నారు. అయితే, క్యారెక్టర్ బాగా ఒప్పించాలంటే, ఎలివేట్ అవ్వాలంటే ఇలాగే ఉండాలని పద్మ భర్త చెప్పారట. శేఖర్ కమ్ముల ఒక రచయిత, దర్శకుడిగా, క్యారెక్టర్ ఎలా ఉండాలనే దానిపై స్పష్టమైన అవగాహనతో ఉంటారు. పాత్రకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం ఆయనకు బాగా తెలుసని అన్నారు. అందువల్ల ఆరోజు గాయత్రికి హెయిర్ కట్ చేయించారని.. హెయిర్ కట్ చేయించుకునే సమయంలో గాయత్రి చాలా ఏడ్చిందని, అందరి మీద కోపం వచ్చిందని పద్మ తెలిపారు. పిల్లలకు జుట్టు అంటే ఎంతో ఇష్టం కదా. శేఖర్ కమ్ముల ఆమెను ఓదార్చేందుకు పెద్ద క్యాడ్‌బరీస్ చాక్లెట్ ఇచ్చి, ఏడవద్దని ప్యాసిఫై చేశారు. అయితే, ఆ బాయ్ కట్ హెయిర్ స్టైలే అప్పు పాత్రకు గొప్ప ప్లస్ పాయింట్ అయ్యిందని పద్మ చెప్పారు. ప్రస్తుతం తన కూతురు పెళ్లి చేసుకుని పిల్లలు, భర్తతో సంతోషంగా ఉందని అన్నారు.

Bengalore Padma

Bengalore Padma

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..

నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం