వరుస సినిమాలతో బిజీ.. ఫిట్నెస్, బ్యూటీ సిక్రెట్ రివీల్ చేసిన రష్మిక..
Rajitha Chanti
Pic credit - Instagram
19 January 2026
ప్రస్తుతం పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే రష్కి మందన్నా. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోలకే షాకిస్తుంది ఈ బ్యూటీ.
ఇటీవలే థామా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలతో అలరించింది. మరోవైపు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. తాజాగా తన ఫిట్నెస్ సీక్రెట్స్ రివీల్ చేసింది.
ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 29 సంవత్సరాలు. తాజాగా తన ఫిట్నెస్ గురించి బయటపెట్టింది. తాను ఒకే రకమైన వ్యాయమం పై ఆధారపడనని చెప్పుకొచ్చింది రష్మిక.
వారానికి నాలుగుసార్లు బేస్ లైన్ వ్యాయమం చేస్తుందట. అలాగే కిక్ బాక్సింగ్, స్కిప్పింగ్, డ్యాన్స్, స్విమ్మింగ్, స్పిన్నింగ్, యోగా, కార్డియో, వాకింగ్ చేస్తుందట.
అలాగే వార్మప్, యాక్టివేషన్ కోసం ఫోమ్ రోల్, స్టెచ్, బ్యాండ్ వరుసలు చేస్తుందట. వ్యాయమం మాత్రమే కాదు డైట్, హైడ్రేట్ గా ఉండడం కూడా ముఖ్యమే అంటుంది.
రోజూ తీసుకునే ఆహారంపై శ్రద్ధ తీసుకుంటుందట. రోజు పెద్ద గ్లాసు నీటిని తాగుతుందట. అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందట.