AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ముగ్గురిలో ఓ స్టార్ హీరోయిన్ ఉంది.. ఎవరో గుర్తుపట్టండి.. ఆమె అందం చూసి వెన్నెలమ్మే చిన్నబోతుంది.. ఎవరంటే..

తక్కువ సమయంలోనే అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో మిడిల్ వన్. పింక్ డ్రెస్‏లో ఎంతో క్యూట్ గా ఉన్న ఆ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.

Tollywood: ఈ ముగ్గురిలో ఓ స్టార్ హీరోయిన్ ఉంది.. ఎవరో గుర్తుపట్టండి.. ఆమె అందం చూసి వెన్నెలమ్మే చిన్నబోతుంది.. ఎవరంటే..
Actress
Rajitha Chanti
|

Updated on: Jan 20, 2023 | 9:30 PM

Share

ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం మధురమైన జ్ఞాపకం. అందుకు సంబంధించిన చిన్న చిన్న గుర్తులు ఇప్పుడు ప్రత్యేకం. అలాంటి అందమైన జ్ఞాపకాలను మరోసారి సోషల్ మీడియా ప్రపంచంలోకి తీసుకువస్తున్నారు. తమ చిన్నప్పటి ఫోటోస్.. స్నేహితులు.. కుటుంబసభ్యులతో కలిసి ఉన్న పిక్చర్స్ షేర్ చేస్తున్నారు. ఇందులో సెలబ్రెటీలు ఎక్కువ. కొన్ని నెలలుగా తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఫాలోవర్లతో పంచుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్.. ఎన్టీఆర్ దగ్గర్నుంచి.. కీర్తిసురేష్.. సాయి పల్లవి.. పూజా హెగ్డే వరకు.. ఇలా ప్రతి హీరోహీరోయిన్స్ రేర్ ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాను ఓ చిన్నారి ఫోటో షేక్ చేస్తుంది. ఆ పిక్చర్ లో ఉన్న చిన్నారి అయినా.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. తక్కువ సమయంలోనే అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో మిడిల్ వన్. పింక్ డ్రెస్‏లో ఎంతో క్యూట్ గా ఉన్న ఆ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ తన సినిమాలతో ప్రేక్షకుల మనసులు దోచుకుంటుంది. ఎవరో గుర్తుపట్టండి.

ఆ చిన్నారి మరెవరో కాదండి. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ వర్ష బొల్లమ్మ. 2015లో వచ్చిన తమిళ్ చిత్రం సతురన్ సినిమాతో తొలిసారిగా కథానాయికగా కనిపించింది. ఇక ఆ తర్వాత 2019లో వచ్చిన చూసి చూడంగానే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కేవలం తెలుగు, తమిళంలోనే కాకుండా మలయాళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. 1995లో జూలై 30న కర్ణాటకలోని కొడగులో జన్మించింది. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్ ఆటోనోమౌస్ కళాశాలో మైక్రోబయాలజీ పూర్తిచేసింది. చిన్నప్పట్నుంచే నటనపై ఆసక్తి ఉన్న వర్ష ప్రారంభంలో రాజా రాణిలోని నజ్రియా నజీమ్ డైలాగ్స్ డబ్స్మాష్ వీడియోలతో గుర్తింపు పొందింది. వర్ష కాస్త నజ్రియా మాదిరిగానే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

తెలుగులో ఆనంద్ దేవరకొండ సరసన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పుష్పక విమానం, స్టాండప్ రాహుల్ చిత్రాల్లో నటించింది. ఇటీవల వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్వాతిముత్యంలోనూ కనిపించింది. ఇటు చిత్రాలే కాకుండా వెబ్ సిరీస్ చేస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంపై కూడా సత్తా చాటుతుంది వర్ష.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం
ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..
ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..
మకరరాశిలో మూడు రాజయోగాలు..! ఈ 3 రాశులవారిపై సంపద వర్షం
మకరరాశిలో మూడు రాజయోగాలు..! ఈ 3 రాశులవారిపై సంపద వర్షం
టీమిండియా చెత్త ఓటమికి ఆ ఇద్దరే నిజమైన ద్రోహులు?
టీమిండియా చెత్త ఓటమికి ఆ ఇద్దరే నిజమైన ద్రోహులు?