AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత బిల్ వస్తుందో తెలుసా..?

ప్రతి ఇంట్లో స్మార్ట్ టీవీ ఉండడం అనేది కామన్. అయితే ఇవి ఎంత స్మార్ట్‌గా వినోదాన్ని అందిస్తున్నాయో.. అంతే స్మార్ట్‌గా మీ కరెంట్ బిల్లును కూడా పెంచుతున్నాయి. అసలు మీ ఇంట్లో ఉన్న స్మార్ట్ టీవీ నెలకు ఎన్ని యూనిట్ల కరెంట్ లాగుతుంది? దాని వల్ల ఎంత బిల్లు వస్తుందో లెక్కలతో సహా పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత బిల్ వస్తుందో తెలుసా..?
Smart Tv Electricity Bill Calculation
Krishna S
|

Updated on: Jun 25, 2026 | 8:44 PM

Share

సాధారణంగా ఇంట్లో కరెంట్ బిల్లు ఎక్కువగా రాగానే అందరి అనుమానం ఏసీ, కూలర్ లేదా రిఫ్రిజిరేటర్ల మీదికే వెళ్తుంది. కానీ మన కళ్ల ముందే ఉంటూ రోజూ గంటల తరబడి నడిచే స్మార్ట్ టీవీ కూడా మీ విద్యుత్ బిల్లును భారీగా పెంచుతోందని మీకు తెలుసా? ఈ రోజుల్లో స్మార్ట్ టీవీలు కేవలం కేబుల్ ఛానెళ్లకే పరిమితం కాలేదు. OTT స్ట్రీమింగ్, గేమింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ అంటూ నిరంతరాయంగా ఆన్‌లోనే ఉంటున్నాయి. స్మార్ట్ టీవీ ఎంత పెద్దదిగా ఉండి, ఎక్కువ ఫీచర్లు కలిగి ఉంటే అది అంత ఎక్కువ కరెంట్ లాగుతుంది. టీవీల స్క్రీన్ సైజును బట్టి గంటకు ఎంత విద్యుత్ ఖర్చవుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఏ టీవీ ఎంత..?

32 ఇంచెస్ టీవీ: గంటకు సుమారు 30 నుండి 60 వాట్ల వరకు విద్యుత్‌ను వినియోగిస్తుంది.

43 నుండి 55 ఇంచెస్ LED స్మార్ట్ టీవీ: గంటకు 50 నుండి 120 వాట్ల వరకు విద్యుత్‌ను వాడుకుంటుంది. అంటే గంటకు సుమారుగా 0.05 నుండి 0.12 యూనిట్ల శక్తి ఖర్చవుతుంది.

పెద్ద స్క్రీన్లు – హై బ్రైట్‌నెస్: టీవీ సైజు ఇంకా పెద్దదై, బ్రైట్‌నెస్ సెట్టింగ్స్ అత్యధికంగా ఉంటే.. కొన్ని మోడళ్లు గంటకు ఏకంగా 300 నుండి 500 వాట్స్ వరకు కూడా కరెంట్‌ను గుంజే అవకాశం ఉంది.

నెలకు టీవీ బిల్లు ఎంత వస్తుందో తెలుసా?

మనం రోజూ సగటున 8 గంటల పాటు టీవీ చూస్తామని అనుకుంటే, నెలవారీ బిల్లు అంచనా ఇలా ఉంటుంది..

40 – 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ: నెలకు 24 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. దీనికి నెలకు రూ.192 వరకు బిల్ రావడం జరుగుతుంది.

55 ఇంచెస్ టీవీ: నెలకు 25 నుండి 35 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. దీనికి రూ. 200 నుండి రూ. 280 కరెంట్ ఛార్జీలు వస్తాయి.

కరెంట్ బిల్లు పెరగడానికి ప్రధాన కారణాలు..

మల్టీ టాస్కింగ్ ఫీచర్లు: కేవలం టీవీ చూడటమే కాకుండా హై-ఎండ్ గేమింగ్ అప్లికేషన్లు రన్ చేయడం, హెచ్‌డీ క్వాలిటీలో ఓటీటీ కంటెంట్ స్ట్రీమింగ్ చేయడం వల్ల ప్రాసెసర్లపై భారం పడి కరెంట్ వినియోగం పెరుగుతుంది.

బ్రైట్‌నెస్ సెట్టింగ్స్: టీవీలో బ్రైట్‌నెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా పెట్టుకోవడం వల్ల డిస్‌ప్లే బ్యాక్‌లైట్ ఎక్కువ పవర్ తీసుకుంటుంది.

నిరంతర వాడకం: ఇంట్లో ఎవరూ లేకపోయినా లేదా చూడకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో టీవీ ఆన్ చేసి ఉంచడం వల్ల నెలాఖరుకు బిల్లులో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది.

బిల్లు తగ్గించుకోవడానికి చిన్న చిట్కాలు

టీవీ చూసేటప్పుడు బ్రైట్‌నెస్‌ను రూమ్ లైటింగ్‌కు తగ్గట్టుగా ఎకో మోడ్ లేదా ఆటో మోడ్‌లో ఉంచడం మంచిది. అలాగే ఉపయోగించనప్పుడు కేవలం రిమోట్‌తోనే కాకుండా మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా పవర్ సేవ్ చేయవచ్చు.

Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి