AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anikha Surendran: ‘బుట్ట బొమ్మ’ కలర్ ఫుల్ గా ఉంటుంది.. అనిక సురేంద్రన్ కామెంట్స్..

బుట్ట బొమ్మ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయం కాబోతుంది అనిక సురేంద్రన్. ఈ సినిమాను ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఇందులో సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Anikha Surendran: 'బుట్ట బొమ్మ' కలర్ ఫుల్ గా ఉంటుంది.. అనిక సురేంద్రన్ కామెంట్స్..
Anikha Surendran
Rajitha Chanti
|

Updated on: Jan 20, 2023 | 3:50 PM

Share

తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఎంతవాడు గానీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనిక సురేంద్రన్. తమిళ్ టూ తెలుగు డబ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అజిత్ కూతురిగా నటించి ఆకట్టుకుంది అనిక. ఆ తర్వాత వచ్చిన విశ్వాసం సినిమాలోనూ అజిత్ తనయగా కనిపించింది అనిక. ఇప్పుడు తొలిసారిగా హీరోయిన్‏గా తెలుగులో నటిస్తోంది. బుట్ట బొమ్మ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయం కాబోతుంది. ఈ సినిమాను ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఇందులో సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జనవరి 26న భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలలో భాగంగా నటి అనిక సురేంద్రన్ విలేకర్ల సమావేశంలో పాల్గొని ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నారు.

బుట్టబొమ్మ లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినప్పుడు ఏమనిపించింది?

ఎన్నో ఏళ్లుగా బాల నటిగా సినిమాల్లో నటిస్తూ వచ్చాను. ఇప్పుడిలా హీరోయిన్ గా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. కప్పేల మలయాళ వెర్షన్ చూశాను.. చాలా నచ్చింది. ఇంతలోనే ఆ ఫిల్మ్ రీమేక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం ఆనందం కలిగించింది. ఆ పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి, నటనకు ఆస్కారం ఉంది.

ఇవి కూడా చదవండి

బుట్టబొమ్మ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం?

అప్పటికే ఈ సినిమా మాతృక చూసి ఉన్నాను. నాకు ఎంతో నచ్చిన ఆ సినిమా రీమేక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. పైగా సితార వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందిస్తోంది. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అంగీకరించాను.

సినిమాలో ఏమైనా మార్పులు చేశారా?

మూల కథ అలాగే ఉంటుంది. కానీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. ఒరిజినల్ ఫిల్మ్ కంటే కూడా ఇది ఇంకా కలర్ ఫుల్ గా ఆకట్టుకునేలా ఉంటుంది.

మొదటిసారి హీరోయిన్ గా నటించడం వల్ల ఏమైనా ఒత్తిడికి లోనయ్యారా?

హీరోయిన్ గా నటించడం ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. పైగా నాది సినిమాలో ప్రధాన పాత్ర. అయితే దర్శకుడు రమేష్ గారు, మిగతా చిత్ర యూనిట్ మద్దుతుతో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా సినిమాని పూర్తి చేయగలిగాను.

మీకు తెలుగు రాదు కదా.. షూటింగ్ లో ఏమైనా ఇబ్బంది పడ్డారా?

తెలుగులో నాకు సంభాషణలకు అర్థం తెలీదు. కానీ సన్నివేశాలను అర్థం చేసుకొని నటించాను. దర్శకుడు రమేష్ గారు ఆ సన్నివేశాల తాలూకు ఎమోషన్స్ ని వివరించి నటన రాబట్టుకున్నారు.

అర్జున్ దాస్ వాయిస్ విని భయపడిన సందర్భాలు ఉన్నాయా?

అవును ఆయన వాయిస్ లో చాలా బేస్ ఉంటుంది. ఆయన వాయిస్ విని చాలా సీరియస్ గా ఉంటారేమో అనుకున్నాను. కానీ ఆయన చాలా స్వీట్ పర్సన్.

రీమేక్ చేసినప్పుడు సహజంగానే మాతృకతో పోలుస్తుంటారు కదా.. నటించేటప్పుడు దాని గురించి ఏమైనా ఆలోచించారా?

ముందే చెప్పినట్లుగా ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలో కొన్ని మార్పులు చేశారు. అలాగే నేను కూడా ఒరిజినల్ ఫిల్మ్ లోని నటిని కాపీ కొట్టే ప్రయత్నం చేయలేదు. పాత్రను అర్థం చేసుకొని ఆ సన్నివేశాలకు తగ్గట్లుగా నటించాను.

సినిమా చూశారా?

ఇంకా చూడలేదు. కొన్ని కొన్ని సన్నివేశాలు చూశాను.. నచ్చాయి. మీతోపాటు సినిమా చూడటానికి ఎంతో ఆస్తికరంగా ఎదురు చూస్తున్నాను.

ఈ సినిమా ద్వారా ఏమైనా నేర్చుకున్నారా?

ఎంతో నేర్చుకున్నాను. దర్శకత్వ విభాగంలో అనుభవమున్న రమేష్ గారు నటన పరంగా ఎన్నో మెలుకువలు నేర్పించారు.

నిర్మాణ సంస్థ గురించి చెప్పండి?

నేను ఇప్పటిదాకా పని చేసిన ఉత్తమ నిర్మాణ సంస్థల్లో సితార ఒకటి. వంశీ గారు నన్ను ఈ చిత్రం కోసం ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. సితార లాంటి పెద్ద సంస్థలో హీరోయిన్ గా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది.

తెలుగులో వరుసగా సినిమాలు చేస్తారా?

మొదటి సినిమానే సితారలో చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా విడుదలకు ముందే తెలుగులో ఇంకా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.

మీ తదుపరి చిత్రాల గురుంచి చెప్పండి?

మలయాళంలో ‘ఓ మై డార్లింగ్’ అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నాను. తమిళ్ లో ఒక మూవీ చేస్తున్నాను. అలాగే కొన్ని తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

Follow Us
కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..
కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..
తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!
తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!
తిరుమల శ్రీవారి కొప్పెర..! ఈ లోహపు పెద్ద పాత్ర ప్రత్యేకత ఏంటో తె
తిరుమల శ్రీవారి కొప్పెర..! ఈ లోహపు పెద్ద పాత్ర ప్రత్యేకత ఏంటో తె
గల్ఫ్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఏం మాట్లాడారంటే..
గల్ఫ్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఏం మాట్లాడారంటే..
ఖమేనీని హత్యకు ట్రంప్ అన్ని చట్టాలను ఉల్లంఘించారా?
ఖమేనీని హత్యకు ట్రంప్ అన్ని చట్టాలను ఉల్లంఘించారా?
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..