AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా.. గుంపు మేస్త్రీనే అంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద సాధారణ ప్రమాద మరణాలకు రూ.1.25 కోట్ల వరకు, విమాన ప్రమాదాల్లో రూ.3 కోట్ల వరకు బీమా రక్షణ లభించనుంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని ప్రారంభిస్తూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. “నేను గుంపు మేస్త్రీనే.. మంత్రివర్గమే నా గుంపు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా.. గుంపు మేస్త్రీనే అంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
CM Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Jun 25, 2026 | 8:51 PM

Share

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా సదుపాయం కల్పించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 14 బ్యాంకులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుని.. ప్రభుత్వ ఉద్యోగులకు రూ. కోటిన్నర ప్రమాద బీమాను అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఒకవేళ విమాన ప్రమాదం జరిగితే.. ఈ బీమా మొత్తం ఏకంగా రూ. 3 కోట్లకు పెరుగుతుంది. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి ఉచిత ప్రమాద బీమా, సమగ్ర ఆర్థిక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బీమా కవరేజ్‌కు సంబంధించిన అవగాహన (MoU) ఒప్పందాలపై సంతకాలు చేసి పథకాన్ని ప్రారంభించారు. ఉద్యోగులు అడగక ముందే ప్రభుత్వం ముందడుగు వేసి ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. మొదటగా సింగరేణి కార్మికులకు బీమా కల్పించేందుకు డిప్యూటీ సీఎం ప్రతిపాదించినప్పుడు నమ్మకం కలగలేదని… కానీ ప్రమాదవశాత్తు మరణించిన 45 మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల బీమా సొమ్మును అందించి ఇది సాధ్యమని నిరూపించారని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్‌ స్పష్టం చేశారు. పీఆర్సీ విషయంలో ఇచ్చిన హామీని కూడా తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు.

నేను గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి..

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గుంపు మేస్త్రీనే అంటూ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎవరు అవహేళన చేసినా.. తాను పట్టించుకోనన్నారు. మంత్రవర్గమంతా తన గుంపే అన్న రేవంత్‌.. ఆ గుంపే తన బలమని స్పష్టం చేశారు. తనను సార్ అని పిలవొద్దతీ.. రేవంత్ అన్న అని పిలిస్తేనే ఇష్టమంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

వీడియో చూడండి..

ఉద్యోగులు అందరికీ బీమా..

తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు భద్రత, భరోసా కల్పించే లక్ష్యంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వం లేదా ఉద్యోగులపై ఒక్క రూపాయి అదనపు భారం లేకుండా ఈ సరికొత్త ఉచిత బీమా పథకాన్ని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోంది.ఈ పథకం ద్వారా సాధారణ ప్రమాదాల్లో మరణిస్తే రూ.1.25 కోట్ల బీమా రక్షణ, విమాన ప్రమాదం సంభవిస్తే రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు బీమా పరిహారం అందనుంది. 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల ఉద్యోగులకు రూ.10 లక్షల జీవిత బీమా రక్షణతో పాటు ప్రమాదవశాత్తూ శాశ్వత సంపూర్ణ లేదా పాక్షిక వైకల్యం సంభవించినా ఆర్థిక అండ లభించనుంది. కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా ప్రభుత్వ రికార్డుల ద్వారా జీతం పొందే కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, ఇతర తాత్కాలిక సిబ్బందికి కూడా ఈ పథకం సమానంగా వర్తించనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తక్కువ పెట్టుబడి.. అదిరిపోయే రాబడి.. రైతును రాజును చేసే పంటలివే..
తక్కువ పెట్టుబడి.. అదిరిపోయే రాబడి.. రైతును రాజును చేసే పంటలివే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్ రిలీఫ్.. పవర్ కట్‌లకు బ్రేక్..!
తెలుగు రాష్ట్రాలకు బిగ్ రిలీఫ్.. పవర్ కట్‌లకు బ్రేక్..!
రిటైర్మెంట్ ప్లాన్‌తోనే లార్డ్స్ బరిలోకి రోహిత్.. చివరి నిమిషంలో
రిటైర్మెంట్ ప్లాన్‌తోనే లార్డ్స్ బరిలోకి రోహిత్.. చివరి నిమిషంలో
ప్రపంచ వేదికపై సిరిసిల్ల ఖ్యాతిని చాటుతున్న చేనేత కళ
ప్రపంచ వేదికపై సిరిసిల్ల ఖ్యాతిని చాటుతున్న చేనేత కళ
అద్భుతమైన టూర్ ప్యాకేజీ.. రూ. 3.46 లక్షలకే 10 రోజుల జపాన్ యాత్ర
అద్భుతమైన టూర్ ప్యాకేజీ.. రూ. 3.46 లక్షలకే 10 రోజుల జపాన్ యాత్ర
కోహ్లీ, ధోని కాదు.. రిటైర్ అయినా రూ. 1189 కోట్లతో గత్తరలేపిన..
కోహ్లీ, ధోని కాదు.. రిటైర్ అయినా రూ. 1189 కోట్లతో గత్తరలేపిన..
భారత రైతు చెమట కష్టానికి ప్రపంచం ఫిదా..!
భారత రైతు చెమట కష్టానికి ప్రపంచం ఫిదా..!
బోనాల పండుగ స్పెషల్.. బెల్లం అన్నం ఇలా చేస్తే.. సూపర్ టేస్ట్
బోనాల పండుగ స్పెషల్.. బెల్లం అన్నం ఇలా చేస్తే.. సూపర్ టేస్ట్
వామ్మో.. మొబైల్ కవర్‌లో ఈ ఒక్క ఆకు పెడితే అదృష్టం కలిసొస్తుందా?.
వామ్మో.. మొబైల్ కవర్‌లో ఈ ఒక్క ఆకు పెడితే అదృష్టం కలిసొస్తుందా?.
బట్టలు ఉతికేటప్పుడు ఈ ఒక్క పొరపాటు చేస్తే వాషింగ్ మెషీన్‌కే నష్టం
బట్టలు ఉతికేటప్పుడు ఈ ఒక్క పొరపాటు చేస్తే వాషింగ్ మెషీన్‌కే నష్టం