బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి..అన్నం మల్లెపూలలా మెత్తగా..రెస్టారెంట్ స్టైల్‌లో…
చాలామందికి అన్నం మెత్తగా అవ్వడం లేదా అడుగున అంటుకుపోవడం వంటి సమస్యలుంటాయి. దీనికి పరిష్కారంగా, అన్నం వండేటప్పుడు అర టీస్పూన్ వంట నూనె కలిపితే హోటల్ స్టైల్‌లో పొడిపొడిగా, అంటుకోకుండా, రుచిగా వస్తుంది. ఇది కుక్కర్‌లో అన్నం పొంగకుండా కూడా నివారిస్తుంది. ఈ సులభమైన చిట్కాతో వంట సులభం అవుతుంది, శుభ్రంగా ఉంటుంది.

సాధారణంగా హోటళ్లలో తయారు చేసే విధంగానే ఇంట్లో కూడా అన్నం వండుకోవాలని అందరి కోరిక. కానీ, చాలా మందికి అన్నం సరిగా వండటం రాదు. ఎలా వండినా అది గిన్నెలో మెత్తగా అవుతుంది. లేదంటే, అడుగున అంటుకుపోతుంది. దీనివల్ల వంట వేస్ట్ అవటం మాత్రమే కాదు.. ఇంట్లో పని కూడా పెరిగిపోతుంది. ఇలా జరగకూడదు అనుకుంటే.. అన్నం వండేటప్పుడు ఒక చిన్న పదార్థాన్ని కలిపారంటే..వంటలో మీకు ఎటువంటి సమస్యలు ఉండవు.
కొంతమంది అన్నం వండేందుకు గిన్నె వాడుతుంటారు. మరికొందరు కుక్కర్‌లో వండుతుంటారు. అయితే, అన్నం సరిగా ఉడకకపోవటం, ఒక్కోసారి చాలా మెత్తగా అవుతుంది. అలాంటి ఫుడ్ తినాలంటే, ఎవరూ ఇష్టపడరు. ఉంటే తినడానికి వెనుకాడతారు. అందుకే ఇంట్లో వండిన అన్నం కూడా హోటళ్లలో మాదిరిగా మల్లెపూలలా, మంచి రుచిగా ఉండాలంటే.. ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి..ఇది చాలా సులభం. మీరు అన్నం వండాలనుకున్నప్పుడు కడిగిన బియ్యంలో అర టీస్పూన్ వంట నూనె వేయాలి. దీనివల్ల అన్నం పాత్రకు అంటుకోకుండా ఉంటుంది. బియ్యం బాగా ఉడికిపోతాయి. అలాగే, అన్నం చక్కగా, చేతులకు అంటుకోకుండా కమ్మటి రుచితో వస్తుంది.
అన్నం వండేటప్పుడు బియ్యంలో అర టీస్పూన్ వంట నూనె వేసినప్పుడు ఏం జరుగుతుందంటే..ఆ నూనె నీటి పైన ఒక పొరను ఏర్పరుస్తుంది. ఇది బియ్యం ఉడికే క్రమంలో మెత్తగా మారకుండా చేస్తుంది. వంట నూనె బియ్యం మరీ ఎక్కువగా ఉడకకుండా నియంత్రిస్తుంది. ఇది ప్రతి బియ్యం గింజను విడిగా ఉంచుతుంది.
కుక్కర్‌లో అన్నం వండేటప్పుడు తరచుగా నీరు బయటకు వచ్చి వంటగది అంతా చిమ్ముతుంది. దీనివల్ల గ్యాస్, కుక్కర్ దెబ్బతింటాయి. అన్నం వండేటప్పుడు కుక్కర్ లోపల నురుగు ఏర్పడుతుంది. కాబట్టి ఇలా జరుగుతుంది. ఇలా జరగకుండా నిరోధించడానికి అన్నం వండేటప్పుడు అర చెంచా వంట నూనె వేయండి. దీనివల్ల నీరు బయటకు రాకుండా ఉంటుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




