AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangotri: గంగోత్రి సినిమా హీరోయిన్ అదితి గుర్తుందా ?.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా..

అల్లు అర్జున్ కథానాయికుడిగా ఎంట్రీ ఇచ్చిన గంగోత్రి సినిమా 2003లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దర్శకేందురుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమానే కాదు.. ఇందులోని పాటలు కూడా ఆల్ టైమ్ హిట్ గా నిలిచాయి. ఎంఎం కీరవాణి అందించిన సంగీతం గురించి చెప్పక్కర్లేదు. ఈ మూవీ తెలుగు సినీరంగానికి పరిచయం అయిన అదితి అగర్వాల్.. దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లెలు.

Gangotri: గంగోత్రి సినిమా హీరోయిన్ అదితి గుర్తుందా ?.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా..
Gangotri
Rajitha Chanti
|

Updated on: Jan 20, 2023 | 9:30 PM

Share

మొదటిసినిమాతోనే స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. చిన్న వయసులోనే వెండితెరపై సంచలనం సృష్టించి ఆ తర్వాత కనుమరుగయ్యారు. తొలి చిత్రం తర్వాత వరుస అవకాశాలు అందుకుని సక్సెస్ అయినవారు కొందరైతే.. మరికొందరు కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే చిత్రాలకు గుడ్ బై చెప్పారు. అలాంటి వారిలో అదితి అగర్వాల్ ఒకరు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది. అల్లు అర్జున్ కథానాయికుడిగా ఎంట్రీ ఇచ్చిన గంగోత్రి సినిమా 2003లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దర్శకేందురుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమానే కాదు.. ఇందులోని పాటలు కూడా ఆల్ టైమ్ హిట్ గా నిలిచాయి. ఎంఎం కీరవాణి అందించిన సంగీతం గురించి చెప్పక్కర్లేదు. ఈ మూవీ తెలుగు సినీరంగానికి పరిచయం అయిన అదితి అగర్వాల్.. దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లెలు.

ఓవైపు తన అక్క ఆర్తి అగర్వాల్ వరుస చిత్రాలతో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. కానీ అక్క సాధించినట్లుగా అగ్రస్థానం మాత్రం అందుకోలేకపోయింది. అతి తక్కువ సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమయ్యింది. 2016లో చివరిసారిగా లవ్ హాయ్ యార్ అక్సెప్ట్ ఇట్ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఫ్యామిలీతో పాటు విదేశాల్లో స్థిరపడింది. అయితే ఇప్పటికీ అదితి పెళ్లి చేసుకోలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన అక్క ఆర్తి అగర్వాల్ జ్ఞాపకాలను పంచుకుంటూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది.

ఇటీవలే తన కోస్టార్ అల్లు అర్జున్ ను కలిసింది అదితి. వీరిద్దరు కలిసిన ఫోటోస్ తెగ వైరలయ్యాయి. బన్నీ న్యూయార్క్ వెకేషన్ లో భాగంగా తన మొదటి హీరోయిన్ అదితి అగర్వాల్ ను కలుసుకోవడం జరిగింది.ఈ క్రమంలోనే ఆదితి అగర్వాల్ బన్నీతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అదితి అగర్వాల్ ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో నివసిస్తున్నారు. ఈ హీరోయిన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి
Aditi

Aditi

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?