Singer Chinmayi: చిరంజీవి క్యాస్టింగ్ కౌచ్‌పై చేసిన వ్యాఖ్యలను సింగర్ చిన్మయి తీవ్రంగా ఖండించారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అంటే లైంగిక ప్రయోజనాలేనని స్పష్టం చేశారు. తనతో పాటు మరికొందరి భయంకరమైన అనుభవాలను, లైంగిక వేధింపుల ఉదాహరణలను పంచుకుంటూ సినీ పరిశ్రమలోని చీకటి కోణాలను బయటపెట్టారు.