OTT Movie: ఓటీటీని షేక్ చేస్తోన్నతెలుగు హారర్ థ్రిల్లర్.. 5 రోజుల్లోనే 50 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్
తెలుగులో గతేడాది చివర్లో వచ్చిన ఈ సూపర్ హిట్ సినిమా గత వారమే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. బిగ్ స్క్రీన్ పై భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు బద్దలు కొడుతోంది. స్ట్రీమింగ్ కు వచ్చిన 5 రోజుల్లోనే ఈ మూవీకి 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చాయి.

గత వారంలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు కూడా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. ఇందులో క్రైమ్, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు ఉన్నాయి. అయితే వీటిలో ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ మాత్రం ఓటీటీ ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. అసలు అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ప్రస్తుతం సినిమాల సక్సెస్ కు సంబంధించి ట్రెండింగ్ లో ఉన్న అన్నీ అంశాలు ఇందులో ఉన్నాయి. సంప్రదాయ భక్తి, దైవ భావం, అలాగే హారర్, సస్పెన్స్, థ్రిల్లింగ్.. ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఈ మూవీలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే గతేడాది ఆఖరులో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందజేసిన ఈ మూవీ గతవారమే ఓటీటీలోకి వచ్చింది. ఈ ఐదు రోజుల్లోనే 50 మిలియన్స్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డును నమోదు చేసింది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా వెల్లడించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఆకాశం నుంచి ఊడిపడిన ఒక ఉల్క గ్రామాన్ని భయ పెడుతుంది. గ్రామస్తులందరూ దానిని ఒక బండ భూతంగా భావించి ప్రాణాలు గుప్పిల్లో పెట్టుకుని బతుకుతుంటారు. వారి భయాన్ని నిజాలు చేస్తూ ఒక దుష్టశక్తి గ్రామస్తుల శరీరంలోకి ప్రవేశించి, వారి మెడల ద్వారా బయటకు వస్తూ అందరినీ చంపుతుంది. ఆ తర్వాత ఈ దుష్టశక్తి శరీరంలో ఉన్నవారు కూడా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తోంది. మరి ఆ దుష్టశక్తి ఏంటి? ఊరుకొచ్చిన సైంటిస్ట్ దాన్ని ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా.
ఆహాలో దూసుకుపోతోన్న శంభాల..
50 Million+ streaming minutes. One haunting story 🔥
Watch #AadiShambhala now only on #aha @iamaadisaikumar @tweets_archana @ugandharmuni pic.twitter.com/Kl6qsle8gN
— ahavideoin (@ahavideoIN) January 26, 2026
ప్రస్తుతం ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోన్న ఈ సినిమా పేరు శంభాల. యుగంధర్ ముని తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ లో అర్చన అయ్యర్ కథానాయికగా నటించింది. స్వసిక, మధునందన్, రవి వర్మ, రామరాజు, హర్ష వర్దన్, అన్నపూర్ణ, లక్ష్మణ్ మీసాల, ఇంద్రనీల్ వర్మ, ప్రవీణ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ కు అవుతోన్న శంభాల సినిమాకు 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ వచ్చాయని ఆహా ఓటీటీ అధికారికంగా ప్రకటించింది.
Add #DolbyAtmos magic to your weekend watchlist for fresh thrill 🙌
Watch #AadiShambhala now on aha@iamaadisaikumar @tweets_archana @ugandharmuni @DolbyIn pic.twitter.com/tsyHa2OECY
— ahavideoin (@ahavideoIN) January 24, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




