AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీ టాప్‌ ట్రెండింగ్‌లో 2 గంటల 45 నిమిషాల హార్ట్ టచింగ్ మూవీ.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్

థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా గత వారమే ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. సిల్వర్ స్క్రీన్ పై కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ దుమ్మురేపుతోంది. టాప్ ట్రెండింగ్ లో కంటిన్యూ అవుతోంది.

OTT Movie: ఓటీటీ టాప్‌ ట్రెండింగ్‌లో 2 గంటల 45 నిమిషాల హార్ట్ టచింగ్ మూవీ.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్
Tere Ishk Mein Movie
Basha Shek
|

Updated on: Jan 28, 2026 | 7:40 PM

Share

గత వారం పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. సస్పెన్స్, క్రైమ్, హారర్, థ్రిల్లర్.. ఇలా అన్ని జానర్ సినిమాలు ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. అయితే ఇందులో ఒక సినిమా మాత్రం ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఓటీటీలో ట్రెండింగ్ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. గతేడాది ఆఖరులో థియేటర్లలోకి అడుగు పెట్టిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ. 160 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ మంచి కలెక్షన్లు సాధించింది. ఇక గతవారమే ఈ సినిమా ఓటీటీలోకి రాగా ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. సుమారు 2 గంటల 45 నిమిషాల సాగే ఈ ఎమోషనల్ మూవీ ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టిస్తోంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హీరో ఢిల్లీలో చదువుకునే ఒక కోపిష్టి యువకుడు. తన రౌడీయిజంతో కాలేజీలో అందరినీ భయపెడుతుంటాడు. అదే కాలేజీలో సైకాలజీ చదువుతున్న హీరోయిన్ ఎలాంటి కోపాన్నైనా ప్రేమతో కంట్రోల్ చేయవచ్చన్నని భావిస్తుంటుంది. తన థీసిస్ పరిశోధన కోసం హీరోను సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ విషయం తెలియక హీరో, హీరోయిన్ ను గాఢంగా ప్రేమిస్తాడు. కానీ ఆమె తనను కేవలం ఒక రీసెర్చ్ మెటీరియల్ గా ఎంచుకుందని తెలిసి కుమిలిపోతాడు. ఎవరకీ కనిపించకుండా పోతాడు. కట్ చేస్తే.. కొన్నేళ్లకు వైమానిక దళంలో పైలట్‌గా చేరి దేశం కోసం పనిచేస్తుంటాడు హీరో. కానీ అతని స్వభావం మాత్రం మారదు. తన ప్రవర్తనతో ఇబ్బందులు పడతాడు. అప్పుడు మళ్లీ హీరోయిన్ అతని జీవితంలోకి వస్తుంది? మరి ఆ తర్వాత ఏం జరిగింది? వీరి ప్రేమ సక్సెస్ అయ్యిందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ ఎమోషనల్ హార్ట్ టచింగ్ మూవీ పేరు ‘తేరే ఇష్క్ మే’. ఆనంద్ ఎల్. రాయ్ తెరకెక్కించిన ఈ మూవీలో ధనుష్, కృతిసనన్ హీరో, హీరోయిన్లుగా నటించారు. జనవరి 23 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. హిందీతో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఓటీటీ టాప్‌ ట్రెండింగ్‌లో 2 గంటల 45 నిమిషాల హార్ట్ టచింగ్ మూవీ
ఓటీటీ టాప్‌ ట్రెండింగ్‌లో 2 గంటల 45 నిమిషాల హార్ట్ టచింగ్ మూవీ
బిగ్ అప్డేట్.. పీఎఫ్ ఖాతాదారులకు బడ్జెట్‌లో గుడ్‌న్యూస్..?
బిగ్ అప్డేట్.. పీఎఫ్ ఖాతాదారులకు బడ్జెట్‌లో గుడ్‌న్యూస్..?
అవి అమ్మేసి చాలా పెద్ద తప్పు చేశా..!
అవి అమ్మేసి చాలా పెద్ద తప్పు చేశా..!
చిన్నారులపై కుక్కలు దాడులు చేస్తుంటే.. మీరేం చేస్తున్నారు?
చిన్నారులపై కుక్కలు దాడులు చేస్తుంటే.. మీరేం చేస్తున్నారు?
పోలీసులమంటారు.. బంగారం దోపిడి చేస్తారు.. పాలమూరులో నయా ముఠా
పోలీసులమంటారు.. బంగారం దోపిడి చేస్తారు.. పాలమూరులో నయా ముఠా
వీరు జామపండు అస్సలు తినకూడదు..!
వీరు జామపండు అస్సలు తినకూడదు..!
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఆ ప్రవేశ పరీక్షల తేదీలు వచ్చేశాయ్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఆ ప్రవేశ పరీక్షల తేదీలు వచ్చేశాయ్
అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి చీకటి చరిత్ర!నిజాలు తెలిస్తే
అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి చీకటి చరిత్ర!నిజాలు తెలిస్తే
'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాకు హర్షవర్దన్ రెమ్యునరేషన్ ఎంతంటే?
'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాకు హర్షవర్దన్ రెమ్యునరేషన్ ఎంతంటే?
హైదరాబాద్‌ శివారులో స్కూల్‌ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు
హైదరాబాద్‌ శివారులో స్కూల్‌ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు