AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఒకప్పుడు చేతినిండా సినిమాలు.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా..

కెరీర్ ప్రారంభంలోనే తన క్యూట్ యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిందీ అందాల తార. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ భాష సినిమాల్లోనూ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అయితే ఒకప్పుడు హీరోయిన్ గా బిజీ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం..

Tollywood: ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఒకప్పుడు చేతినిండా సినిమాలు.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా..
Actress Surbhi
Basha Shek
|

Updated on: Jan 27, 2026 | 8:36 PM

Share

పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ ను గుర్తు పట్టారా? ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొన్నటివరకు తెలుగులో క్రేజీ హీరోయిన్. యంగ్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఎక్కువగా యంగ్ హీరోలతోనే నటించి మెప్పించింది. చాలా తక్కువ కాలంలోనే తన క్యూట్ యాక్టింగ్ తో చాలా మందికి ఫేవరెట్ యాక్ట్రెస్ గా మారిపోయింది. కేవలం తెలుగులోనే కాదు తమిళం, కన్నడ భాషా సినిమాల్లోనూ యాక్ట్ చేసిందీ అందాల తార. అయితే ఇదంతా గతం. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపిన హీరోయిన్ ఇప్పుడు మాత్రం సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటోంది. ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో కనిపించి దాదాపు ఐదేళ్లవుతోంది. చివరిగా ఈ బ్యూటీ 2023లో ఓ తమిళ సినిమాలో నటించింది. ఆ తర్వాత కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తోంది. తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది.అలా తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఇందులో ఉన్నదెవరో గుర్తు పట్టారా?

‘ఇవన్ వేరే మాదిరి’ అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది సురభి. తెలుగులో సందీప్ కిషన్ హీరోగా నటించిన బీరువా సినిమాతో పరిచయమైంది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా, శర్వానంద్ హీరోగా వచ్చిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ మూవీ తో మంచి హిట్ అందుకుందీ అందాల తార. దీని తర్వాత సురభికి ఆఫర్లు క్యూ కట్టాయి. ‘ఎటాక్’ ‘జెంటిల్ మేన్’ ‘ఒక్క క్షణం’ ‘ఓటర్’, ‘శశి’ తదితర చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. అయితే వీటిలో జెంటిల్ మెన్ మాత్రమే సూపర్ హిట్ గా నిలిచింది. మిగతావన్నీ సోసో గా ఆడాయి. తమిళం, కన్నడ భాషల్లోనూ నటించిన ఈ ముద్దుగుమ్మకు సాలిడ్ హిట్ మాత్రం పడలేదు.

ఇవి కూడా చదవండి

సురభి లేటెస్ట్ ఫొటోస్..

అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న విశ్వంభర సినిమాలో సురభి ఓ కీలక పాత్రలో నటించనుంది. బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ చాలా రోజులుగా జరుగుతోంది. అయతే ఈ జులైలో ఈ సినిమా విడుదల కావొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి సురభి ఆశలన్నీ విశ్వంభరపైనే ఉన్నాయని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సినిమాలకు దూరంగా ఉన్న ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
సినిమాలకు దూరంగా ఉన్న ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ఇంట్లో ఒంటె విగ్రహం పెట్టుకుంటే మీ అదృష్టం,డబ్బుకు లోటు ఉండదు..!
ఇంట్లో ఒంటె విగ్రహం పెట్టుకుంటే మీ అదృష్టం,డబ్బుకు లోటు ఉండదు..!
ఒక్కసారి ఈ చట్నీ రుచి చూస్తే కొబ్బరి చట్నీని మర్చిపోతారు!
ఒక్కసారి ఈ చట్నీ రుచి చూస్తే కొబ్బరి చట్నీని మర్చిపోతారు!
5 రోజుల్లో 16 మ్యాచ్‌లు.. రంగంలోకి 2 భారత జట్లు.. షెడ్యూల్ ఇదిగో
5 రోజుల్లో 16 మ్యాచ్‌లు.. రంగంలోకి 2 భారత జట్లు.. షెడ్యూల్ ఇదిగో
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆర్టీసీలో 7673 పోస్టుల..
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆర్టీసీలో 7673 పోస్టుల..
కూరగాయలను ప్లాస్టిక్ కవర్లలో ఉంచుతున్నారా? ఇది తెలుసుకోండి..
కూరగాయలను ప్లాస్టిక్ కవర్లలో ఉంచుతున్నారా? ఇది తెలుసుకోండి..
ఈ నటికి ఇంత పెద్ద కూతుర్లు ఉన్నారా? హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోరు
ఈ నటికి ఇంత పెద్ద కూతుర్లు ఉన్నారా? హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోరు
హైకోర్టును ఆశ్రయించిన మన శంకరవరప్రసాద్ గారు చిత్ర నిర్మాత
హైకోర్టును ఆశ్రయించిన మన శంకరవరప్రసాద్ గారు చిత్ర నిర్మాత
రాత్రి భోజనం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి
రాత్రి భోజనం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి
ఖైరతాబాద్ లో కుక్కల స్వైరవిహారం
ఖైరతాబాద్ లో కుక్కల స్వైరవిహారం