Tech Tips: మీ మొబైల్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే గూగుల్ క్రోమ్‌లో ఈ సెట్టింగ్స్ చేసుకోండి!
Tech Tips: మీ మొబైల్ హ్యాక్ అవ్వకుండా, వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉండాలంటే గూగుల్ క్రోమ్ లోని కొన్ని సెట్టింగ్స్ మార్చాలి. పాస్‌వర్డ్‌లు, పేమెంట్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఆటో సైన్ ఇన్, పాస్‌వర్డ్ సేవ్, పేమెంట్ మెథడ్స్ సేవ్ వంటి ఆప్షన్లను ఆఫ్ చేయాలి. ఇది మీ సోషల్ మీడియా, బ్యాంకింగ్ వివరాల భద్రతకు కీలకం..

Tech Tips: ఈ రోజుల్లో హ్యాకర్ల ప్రమాదం ఎక్కువైపోయింది. ఎంత భద్రంగా ఉన్నప్పటికీ సైబర్ నేరగాళ్లు మనకు తెలియకుండానే మన మొబైల్‌ను హ్యాక్ చేసేస్తున్నారు. ఫోన్‌లో ఉండే డేటాను తస్కరిస్తున్నారు. మొబైల్‌లో ఉండే బ్యాంక్ వివరాలు, ఇతర ఆధార్, పాన్ అన్ని వివరాలను తెలుసుకుని బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేసేస్తున్నారు. అయితే దీనిపై టెక్ నిపుణులు, పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నప్పటికీ ఎన్నో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి హ్యాకింగ్ ప్రమదంలో పడకుండా ఉండాలంబటే మొబైల్‌లో కొన్ని సెట్టింగ్స్‌ను మార్చితే సరిపోతుందంటున్నారు టెక్ నిపుణులు.
మీ మొబైల్ భద్రతను మెరుగుపరచడానికి, మీ వ్యక్తిగత డేటా హ్యాక్ అవ్వకుండా రక్షించడానికి గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో కొన్ని ముఖ్యమైన సెట్టింగ్‌లను మార్చడం చాలా అత్యవసరం అంటున్నారు టెక్ నిపుణులు. ఈ సెట్టింగ్‌లను ఆఫ్ చేయకపోతే మీ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, జీమెయిల్, క్రెడిట్ కార్డ్ వివరాలు, ఫోన్ పే, గూగుల్ పే వంటి సున్నితమైన సమాచారం మాల్వేర్ లేదా స్పైవేర్ ద్వారా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి: Business Idea: మతిపోగొట్టే బిజినెస్ ఐడియా.. వీటిని సాగు చేస్తే ఇంత లాభమా? లక్షల్లో ఆదాయం!
1. ఈ సెట్టింగ్‌లను మార్చడానికి, ముందుగా గూగుల్ క్రోమ్‌ను తెరిచి, కుడి వైపు పైన ఉన్న మూడు చుక్కలపై నొక్కి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి.
2. పాస్‌వర్డ్ మేనేజర్ సెట్టింగ్‌లు: సెట్టింగ్స్‌లో పాస్‌వర్డ్ మేనేజర్ అనే ఆప్షన్‌ను ఎంపికను ఎంచుకోవాలి. అందులో ఆటో సైన్ ఇన్, ఆఫర్స్ టు సేవ్ పాస్‌వర్డ్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ రెండింటినీ వెంటనే ఆఫ్ చేయాలి. మొబైల్‌లో మాల్వేర్ లేదా స్పైవేర్ డౌన్‌లోడ్ అయినప్పుడు ఈ ఆప్షన్లు ఆన్‌లో ఉంటే అవి మీ సేవ్ చేసిన కుకీలు, పాస్‌వర్డ్‌లను సులభంగా యాక్సెస్ చేసే అవకాశం ఉంది.
3. పేమెంట్ మెథడ్స్ సెట్టింగ్‌లు: మళ్ళీ సెట్టింగ్స్ ప్రధాన మెనూకి వచ్చి, పేమెంట్ మెథడ్స్ విభాగానికి వెళ్ళాలి. ఇక్కడ సేవ్ అండ్ ఫిల్ పేమెంట్ మెథడ్స్ అనే ఆప్షన్‌ను ఆఫ్ చేయాలి. ఈ ఆప్షన్ ఆన్‌లో ఉంటే మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ వంటి సున్నితమైన చెల్లింపు సమాచారం మొబైల్‌లో సేవ్ అవుతుంది. ఇది కూడా హ్యాకర్లకు సులువుగా అందుబాటులోకి వచ్చే ప్రమాదం ఉంది.
ఈ రెండు సెట్టింగ్‌లను ఆఫ్ చేయడం ద్వారా మీ మొబైల్ డేటా, ఆర్థిక వివరాల భద్రత గణనీయంగా పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: Gold Price Today: దడపుట్టిస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
