Meta: వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వాడేవారికి బ్యాడ్‌న్యూస్.. త్వరలో సబ్‌స్క్రిప్షన్ మోడల్.. డబ్బులు కడితేనే యాక్సెస్..
ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ చాలామంది వాడుతూ ఉంటారు. ఈ మూడింటిల్లో ఒక్క యాప్ అయినా వినియోగిస్తూ ఉంటారు. అయితే త్వరలో వీటిల్లో ప్రీమియం ఫీచర్లు వాడాలంటే డబ్బులు పే చేేయాల్సి ఉంటుంది. అవును.. త్వరలో సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు మోటా రెడీ అవుతోంది.

వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ను వాడుకోవడానికి ఇప్పటివరకు ఎలాంటి ఛార్జీలు విధించడం లేదు. ఉచితంగా వీటిని వినియోగించుకోవచ్చు. మెస్సేజింగ్, వాయిస్, వీడియో కాల్స్, ఫైల్స్ సెండింగ్ వంటి సేవలు ఉచితంగా పొందవచ్చు. ఇక ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బ్లూ టిక్ కావాలన్నా లేదా ఇతర ప్రీమియం ఫీచర్లు వాడుకోవాలన్నా కొంత మొత్తంలో సబ్‌స్క్రిప్షన్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. త్వరలో మోటా కూడా ఇదే బాటలో నడవనుంది. ప్రీమియం ఫీచర్లను వాడుకునేందుకు యూజర్ల నుంచి రుసుంలు వసూలు చేయనుంది. ప్రస్తుతం ఈ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌పై మెటా ఫోకస్ పెట్టింది. దీనిని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
త్వరలోనే సబ్‌స్క్రిప్షన్ మోడల్
టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. ఈ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌పై మోటా ముందుడగు వేస్తోందని, త్వరలోనే ఆ సంస్థకు చెందిన ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ ఫ్లాట్‌ఫామ్‌లలో ప్రవేశపెట్టనుందని తెలిసింది. ఈ పెయిడ్ మెంబర్షిప్‌లో ఏఐ ఫీచర్లతో పాటు సృజనాత్మకతను అన్ లాక్ చేసే పలు ప్రయోజనాలు ఉండనున్నాయి. మోటా ప్రీమియం ఫీచర్లలో సోషల్ మీడియాను మరింత ఎక్స్‌పీరియన్స్ చేసే సేవలు ఉండనున్నాయి. మరికొద్ది నెలల్లోనే ఈ సబ్‌స్క్రిప్షన్ మోడల్ ప్రవేశపెట్టనుందని, ఇందులో ప్రత్యేక ఫీచర్లను యాక్సెస్, ప్రజలు ఎలా పంచుకుంటారు, కనెక్ట్ అవుతారు అనే దానిపై నియంత్రణ ఉంటుంది. అదే సమయంలో కోర్ అనుభవాన్ని ఉచింగా ఉంచుతుందని క్రంచ్ తన రిపోర్టులో పేర్కొంది.
ప్రీమియం ఫీచర్లతో ఏఐ మోడల్
ప్రతీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రత్యేక లక్షణాలతో ఈ సబ్‌స్క్రిప్షన్ మోడల్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ ప్రీమియం మెంబర్స్‌కు ప్రత్యేక లక్షణాలను అందించనుండగా.. వాట్సప్ వేరే రకమైన ప్రోత్సాహకాలను అందించనుంది. ఇక 2 బిలియన్ డాలర్లతో మోటా కొనుగోలు చేసిన ఏఐ ఏజెంట్ మనుస్‌ను రాబోయే సబ్‌స్క్రిప్షన్‌లో ఆఫర్‌గా ఇవ్వనుంది. వినియోగదారులు, క్రియేటర్లు, వ్యాపారులకు ప్రీమియం ఫీచర్లను విస్తరిస్తూనే ఏఐ ద్వారా ఆదాయం సంపాదించేందుకు మెటా ప్రయత్నించనుంది. ఏఐ ఏజెంట్‌ను నేరుగా మోటా ఫ్లాట్‌ఫామ్స్‌లో విలీనం చేయనుంది. వ్యాపారులకు ఇది స్వతంత్ర సభ్యత్వంగా అమ్మకం కొనసాగుతుంది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో మనుస్ ఏఐ షార్ట్‌కట్‌ను మెటా పరీక్షిస్తోంది. మనుస్‌తో పాటు వైబ్స్ వీడియో జనరేషన్, ఇతర ఏఐ ఆధారిత ఫీచర్లను సబ్‌స్క్రిప్షన్ జాబితాలో చేర్చనుందని తెలుస్తోంది. ఇక ఏఐ వీడియో క్రియేషన్, రీమిక్సింగ్ గత సంవత్సరంలో ప్రారంభించినప్పటి నుంచి ఉచితంగా అందిస్తోంది. కొత్త మోడల్‌లో వినియోగదారులు అన్‌లిమిటెడ్ ఉచిత యాక్సెస్‌ను పొందనున్నారు.
