Gold Price Today: దడపుట్టిస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
దేశంలో బంగారం, వెండి ధరలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బంగారం, వెండి ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Gold, Silver Price Today: బంగారం, వెండి ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. పోటాపోటీగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు బంగారం, వెండి కొనాలంటేనే భయపడిపోతున్నారు. ఇప్పుడు రానున్నది పెళ్లిళ్ల సీజన్. అప్పుడు అసలు భయం బంగారం కొనుగోలు విషయంలో తలెత్తుతుంది. ఇప్పుడు రోజురోజుకు పెరగడం లేదు. గంట గంటకు పెరుగుతున్నాయి. రోజుఓ ఎప్పుడు ఏ ధర ఉంటుందో చెప్పలేని పరస్థితి నెలకొంది. తాజాగా జనవరి 28వ తేదీన దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,940 వద్ద ట్రేడవుతుండగా, అదే 22 క్యారెట్ల ధర రూ.1,48,440 వద్ద ఉంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,450 వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
హైదరాబాద్:
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,940
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,440
విజయవాడ:
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,940
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,440
ముంబై:
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,940
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,440
ఢిల్లీ:
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,090
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,590
బెంగళూరు:
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,940
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,440
చెన్నై:
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,190
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,590
వెండి ధరలు:
- హైదరాబాద్: కిలోవెండి ధర రూ.3,87,100
- ఢిల్లీ: కిలోవెండి ధర రూ.3,70,100
- ముంబై: కిలోవెండి ధర రూ.3,70,100
- బెంగళూరు: కిలోవెండి ధర రూ.3,70,100
- చెన్నై: కిలోవెండి ధర రూ.3,87,100
ఇది కూడా చదవండి: రైలు ఆలస్యం కారణంగా పరీక్ష మిస్.. విద్యార్థికి రూ.9 లక్షల పరిహారం.. కోర్టు సంచలన తీర్పు!
ఇది కూడా చదవండి: Business Idea: మతిపోగొట్టే బిజినెస్ ఐడియా.. వీటిని సాగు చేస్తే ఇంత లాభమా? లక్షల్లో ఆదాయం!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




