AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫీస్ బ్యాగ్‌లో ఇవి ఉంటే దరిద్రమే.. మీ కెరీర్ బాగుండాలంటే వెంటనే ఇలా చేస్తే చాలు..

Vastu Tips: మీరు ఆఫీసులో ఎంత కష్టపడినా ఆశించిన గుర్తింపు రావడం లేదా..? ప్రతి పనిలో ఏదో ఒక ఆటంకం ఎదురవుతోందా..? అయితే మీ కష్టంతో పాటు మీరు రోజూ తీసుకెళ్లే ఆఫీస్ బ్యాగ్‌లో ఉన్న వస్తువులు కూడా దీనికి కారణం కావచ్చు. అందులో మనం పెట్టే కొన్ని వస్తువులు మన ప్రగతిని అడ్డుకుంటాయని శాస్త్రం చెబుతోంది. మరి మీ కెరీర్ సాఫీగా సాగాలంటే మీ బ్యాగ్‌లో ఏవి ఉండాలి..?

ఆఫీస్ బ్యాగ్‌లో ఇవి ఉంటే దరిద్రమే.. మీ కెరీర్ బాగుండాలంటే వెంటనే ఇలా చేస్తే చాలు..
Vastu Tips For Career Growth
Krishna S
|

Updated on: Jan 28, 2026 | 7:15 AM

Share

మనం ఇంటి నుండి ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళ్లే బ్యాగ్ కేవలం వస్తువులను సర్దుకునేది మాత్రమే కాదు, అది మన వృత్తిపరమైన శక్తికి ప్రతిరూపం. వాస్తు శాస్త్రం ప్రకారం.. మన ఇంట్లోని దిశలు ఎంత ముఖ్యమో, మనం రోజూ వాడే వస్తువుల స్థితిగతులు కూడా అంతే ముఖ్యం. తెలిసి తెలియక మనం ఆఫీస్ బ్యాగ్‌లో పెట్టే కొన్ని వస్తువులు మన పనిలో ఆటంకాలను, మనసులో గందరగోళాన్ని సృష్టిస్తాయి. మరి మీ బ్యాగ్‌లో ఏవి ఉండాలి? ఏవి ఉండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

పాత బిల్లులు.. మానసిక భారం

చాలామందికి షాపింగ్ చేసిన బిల్లులు లేదా తిన్న వస్తువుల రిసీప్ట్‌లను బ్యాగ్‌లో వేయడం అలవాటు. వాస్తు ప్రకారం.. పాత బిల్లులు ప్రతికూల శక్తిని కలిగి ఉంటాయి. ఇవి మీ మనసులో అనవసరమైన గందరగోళాన్ని సృష్టించి, పనిపై ఏకాగ్రత దెబ్బతినేలా చేస్తాయి. ఇది చివరికి మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది.

పదునైన వస్తువులు జాగ్రత్త

కత్తెర్లు, బ్లేడ్లు లేదా ఇతర పదునైన వస్తువులను నేరుగా బ్యాగ్‌లో ఉంచడం వాస్తు రీత్యా అశుభం. ఇవి ప్రతికూలతను పెంచడమే కాకుండా మీ వృత్తిపరమైన అభివృద్ధిని అడ్డుకుంటాయి. ఒకవేళ తప్పనిసరిగా ఉంచాల్సి వస్తే వాటిని ఒక పౌచ్‌లో లేదా కవర్‌లో చుట్టి మాత్రమే ఉంచాలి.

విరిగిన పెన్నులు.. ఆగిపోయిన పనులు

రాకపోయినా లేదా విరిగిపోయినా పెన్నులను బ్యాగ్‌లోనే ఉంచడం మనం చేసే అతిపెద్ద తప్పు. విరిగిన పెన్నులు, పనిచేయని ఛార్జర్లు, పాడైపోయిన హెడ్‌ఫోన్‌లు మన శక్తిని క్షీణింపజేస్తాయి. ఇవి బ్యాగ్‌లో ఉంటే మీ పనులు కూడా అలాగే నిలిచిపోతాయని లేదా ఆలస్యం అవుతాయని వాస్తు నియమాలు చెబుతున్నాయి.

వ్యక్తిగత వస్తువుల నిర్వహణ

దువ్వెనలు, పెర్ఫ్యూమ్‌లు లేదా ఇతర వ్యక్తిగత పరిశుభ్రత వస్తువులను బ్యాగ్‌లో ఇష్టమొచ్చినట్లు పడేయకూడదు. వాటిని ఒక ప్రత్యేక పౌచ్‌లో ఉంచి బ్యాగ్‌లో సర్దుకోవాలి. వీలైతే వీటిని ఆఫీస్ డ్రాయర్‌లో ఉంచుకోవడం ఇంకా మంచిది.

క్రమం తప్పకుండా శుభ్రం చేయండి

వారానికి ఒకసారి మీ బ్యాగ్‌ని ఖాళీ చేసి, అనవసరమైన కాగితాలను, చెత్తను తొలగించండి. వస్తువులను సర్దుకున్న తీరు మీ వ్యక్తిత్వాన్ని మరియు మీ పని పట్ల మీకున్న శ్రద్ధను ప్రతిబింబిస్తుంది. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మీ పని వాతావరణంలో సానుకూలత పెరుగుతుంది. మీ ఆఫీస్ బ్యాగ్ ఎంత శుభ్రంగా, పద్ధతిగా ఉంటే మీ కెరీర్ అంత వేగంగా పురోగతి చెందుతుంది.

(Note: ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)

ఆఫీస్ బ్యాగ్‌లో ఇవి ఉంటే దరిద్రమే.. మీ కెరీర్ బాగుండాలంటే వెంటనే
ఆఫీస్ బ్యాగ్‌లో ఇవి ఉంటే దరిద్రమే.. మీ కెరీర్ బాగుండాలంటే వెంటనే
అర్జిత్ సింగ్ ఒక్కో సాంగ్‌కు ఎంత తీసుకుంటాడు? మొత్తం ఆస్తులెంత?
అర్జిత్ సింగ్ ఒక్కో సాంగ్‌కు ఎంత తీసుకుంటాడు? మొత్తం ఆస్తులెంత?
ఈసారి అన్ని ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లపై QR కోడ్‌.. ఎందుకంటే?
ఈసారి అన్ని ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లపై QR కోడ్‌.. ఎందుకంటే?
రెండు విడతల్లో కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు..
రెండు విడతల్లో కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు..
మొబైల్ హ్యాక్ అవ్వకుండా గూగుల్ క్రోమ్‌లో ఈ సెట్టింగ్స్ చేసుకోండి
మొబైల్ హ్యాక్ అవ్వకుండా గూగుల్ క్రోమ్‌లో ఈ సెట్టింగ్స్ చేసుకోండి
ఆ 30 నిమిషాలు సంజూ శాంసన్ రాత మారుస్తుందా?
ఆ 30 నిమిషాలు సంజూ శాంసన్ రాత మారుస్తుందా?
చెన్నైకి షాకింగ్ న్యూస్.. రూ. 14.20 కోట్ల యంగ్ సెన్సేషన్ ఔట్..?
చెన్నైకి షాకింగ్ న్యూస్.. రూ. 14.20 కోట్ల యంగ్ సెన్సేషన్ ఔట్..?
వామ్మో.. తులం బంగారం రూ.9 లక్షలు అవుతుందా?
వామ్మో.. తులం బంగారం రూ.9 లక్షలు అవుతుందా?
అయ్యో పాపం ఏ తల్లి కన్న బిడ్డో.. ఆటోలో ఏడిస్తూ కనిపించిన పసికందు
అయ్యో పాపం ఏ తల్లి కన్న బిడ్డో.. ఆటోలో ఏడిస్తూ కనిపించిన పసికందు
ఉదయాన్నే ఇవి తింటే చాలు.. బరువును తగ్గించే మ్యాజిక్ బ్రేక్‌ఫాస్ట్
ఉదయాన్నే ఇవి తింటే చాలు.. బరువును తగ్గించే మ్యాజిక్ బ్రేక్‌ఫాస్ట్