Money Astrology: శకట యోగం.. ఆ రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త..!
Shakata Yoga Impact: చంద్రుడికి గురువు దుస్థానాల్లో ఉన్న పక్షంలో శకట యోగమనే కష్ట నష్టాల యోగం కలుగుతుంది. మీ రాశికి గురువు 1, 3, 6, 8, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు ఈ శకట యోగం కలుగుతుంది. ఈ యోగం కలిగినప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏర్పడుతుంది. డబ్బు ఇవ్వడం కానీ, డబ్బు తీసుకోవడం గానీ చేయకూడదు. జీవితం గతుకుల రోడ్డు మీద ప్రయాణం సాగించినట్టుగా ఉంటుంది. ఒడిదుడుకులు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం మేషం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, మకర రాశుల వారు జూన్ 3 వరకు ఈ శకట యోగాన్ని అనుభవించాల్సి వస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5