AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒక్క హిట్‌తోనే ఎనలేని గుర్తింపు.. సినిమా టైటిల్స్‌నే ఇంటి పేరుగా మార్చుకున్న సెలబ్రిటీస్!

వెండితెరపై ఒక నటుడికి గుర్తింపు రావడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. కానీ కొందరు అదృష్టవంతులకు వారు చేసే మొదటి సినిమా లేదా ఒక ప్రత్యేకమైన పాత్ర ఎంతటి ప్రభావాన్ని చూపుతుందంటే.. ప్రేక్షకులు వారి అసలు ఇంటి పేరును మర్చిపోయి ఆ సినిమా పేరుతోనే పిలవడం మొదలుపెడతారు.

Tollywood: ఒక్క హిట్‌తోనే ఎనలేని గుర్తింపు.. సినిమా టైటిల్స్‌నే ఇంటి పేరుగా మార్చుకున్న సెలబ్రిటీస్!
Allari Naresh And Dil Raju
Nikhil
|

Updated on: Jan 27, 2026 | 9:32 PM

Share

ఈ క్రమంగా ఆ సినిమా టైటిల్ వారి ఇంటి పేరు కంటే బలంగా మారిపోతుంది. రంగుల ప్రపంచంలో తమకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆ నటులు, తమ అసలు పేర్ల కంటే సినిమా పేర్లతోనే పాపులర్ అయ్యారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇలా సినిమా పేర్లనే తమ గుర్తింపుగా మార్చుకున్న ఆ నటులు ఎవరు? ఆ పేర్లు రావడానికి కారణమైన ఆయా సినిమాల విశేషాలేంటి? ‘సత్యం’ నుంచి ‘ఆహుతి’ వరకు సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్న ప్రముఖుల గురించి తెలుసుకుందాం..

సత్యం రాజేష్

కామెడీతో పాటు విలక్షణమైన పాత్రలతో అలరిస్తున్న రాజేష్‌కు ‘సత్యం’ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? నితిన్ హీరోగా వచ్చిన ‘సత్యం’ సినిమాలో రాజేష్ చేసిన కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, అప్పటి వరకు కేవలం రాజేష్‌గా ఉన్న ఆయన ‘సత్యం’ రాజేష్‌గా మారిపోయారు. ఇప్పుడు ఆయన ఏ సినిమా చేసినా ఆ పేరే బ్రాండ్‌గా నిలుస్తోంది.

Ahuti Prasad And Subhalekha Sudhakar

Ahuti Prasad And Subhalekha Sudhakar

ఆహుతి ప్రసాద్

తెలుగు తెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు ప్రసాద్. రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘ఆహుతి’ సినిమాలో ఆయన ప్రతినాయకుడిగా అద్భుతంగా నటించారు. ఆ పాత్ర సృష్టించిన ఇంపాక్ట్ వల్ల ఆయన పేరు ‘ఆహుతి’ ప్రసాద్‌గా స్థిరపడిపోయింది. ఆ తర్వాత ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించినా, ఆ సినిమా పేరు మాత్రం ఆయన వెంటే ఉండిపోయింది.

‘అల్లరి’ నరేష్

రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అల్లరి’ సినిమాతో నరేష్ కెరీర్ ప్రారంభమైంది. ఆ సినిమా సాధించిన భారీ విజయంతో నరేష్ ఇంటి పేరు ‘అల్లరి’గా మారిపోయింది. ఇండస్ట్రీలో ఇతర నరేష్‌లు ఉన్నప్పటికీ, ‘అల్లరి’ నరేష్ అంటేనే వెంటనే ఈ కామెడీ కింగ్ గుర్తుకువస్తారు.

‘శుభలేఖ’ సుధాకర్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శుభలేఖ’ సినిమా ద్వారా సుధాకర్ వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అప్పటి నుంచి సుధాకర్ అనే పేరు ముందు ‘శుభలేఖ’ చేరిపోయి ఆయన ఇంటి పేరులా మారిపోయింది.

‘వెన్నెల’ కిషోర్

దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించిన ‘వెన్నెల’ సినిమా ద్వారా కిషోర్ కమెడియన్‌గా పరిచయమయ్యారు. అందులో ఆయన కామెడీ టైమింగ్ చూసి ఫిదా అయిన ప్రేక్షకులు, ఆయనను ‘వెన్నెల’ కిషోర్ అని పిలవడం ప్రారంభించారు. నేడు ఆయన టాలీవుడ్‌లో తిరుగులేని కమెడియన్.

‘తాగబోతు’ రమేష్

‘మహాత్మా’ సినిమాలో ఒక తాగుబోతు పాత్రలో అద్భుతంగా నటించిన రమేష్, ఆ తర్వాత ‘తాగబోతు’ రమేష్‌గా పాపులర్ అయ్యారు. ఆయన చేసే మేనరిజమ్స్, డైలాగ్స్ ఆ పేరుకు తగ్గట్టుగా ఉండి ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

‘దిల్’ రాజు

కేవలం నటులే కాదు, నిర్మాతలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. నితిన్ హీరోగా వచ్చిన ‘దిల్’ సినిమా భారీ విజయం సాధించడంతో నిర్మాత వెంకట రమణారెడ్డి కాస్తా ‘దిల్’ రాజుగా మారిపోయారు. ఈ పేరు ఆయనకు ఎంతటి గుర్తింపును ఇచ్చిందంటే, ఇప్పుడు ఆయన ఒక బడా నిర్మాతగా ఎదిగారు.

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి

కే. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ సినిమాతో సీతారామశాస్త్రికి ఆ పేరు స్థిరపడిపోయింది. ఆయన రాసిన అద్భుతమైన సాహిత్యం వల్ల ఆ పేరు ఒక గౌరవ ప్రదమైన బిరుదుగా మారింది.

సినిమా రంగంలో కష్టపడి సంపాదించుకున్న కీర్తికి ఈ పేర్లే నిదర్శనాలు. పుట్టుకతో వచ్చిన ఇంటి పేరు కంటే, ప్రేక్షకులే ప్రేమతో పిలుచుకునే ఈ పేర్లు ఆ నటుల కెరీర్‌లో ఒక మైలురాయిగా మిగిలిపోయాయి. వారి ప్రతిభకు, వారు పోషించిన పాత్రలకు ఇదే అసలైన గౌరవం.

సినిమాలే ఇంటి పేర్లుగా పాపులర్ అయిన టాలీవుడ్ సెలబ్రిటీలు
సినిమాలే ఇంటి పేర్లుగా పాపులర్ అయిన టాలీవుడ్ సెలబ్రిటీలు
‘ధురంధర్’లో హీరోయిన్ రోల్‌ రిజెక్ట్ చేసిన టాలీవుడ్ బ్యూటీ ఎవరంటే?
‘ధురంధర్’లో హీరోయిన్ రోల్‌ రిజెక్ట్ చేసిన టాలీవుడ్ బ్యూటీ ఎవరంటే?
ఈ టైమ్‌లో తుమ్మితే అదృష్టమా.. శకున శాస్త్రం చెబుతున్న అవాక్కయ్యే
ఈ టైమ్‌లో తుమ్మితే అదృష్టమా.. శకున శాస్త్రం చెబుతున్న అవాక్కయ్యే
గంగా నదిలో కొట్టుకుపోతున్న పర్యాటకుడు.. రాఫ్టింగ్ గైడ్‌ల రక్షణ..
గంగా నదిలో కొట్టుకుపోతున్న పర్యాటకుడు.. రాఫ్టింగ్ గైడ్‌ల రక్షణ..
‘నన్ను ప్రోత్సహించే వాళ్లే లేరు’ అంటూ 'సమంత ఎమోషనల్ పోస్ట్!
‘నన్ను ప్రోత్సహించే వాళ్లే లేరు’ అంటూ 'సమంత ఎమోషనల్ పోస్ట్!
వైజాగ్‌లో మరోసారి కివీస్‌కు బడితపూజే.. ఈసారి 5 ఓవర్లలోనే
వైజాగ్‌లో మరోసారి కివీస్‌కు బడితపూజే.. ఈసారి 5 ఓవర్లలోనే
డాలర్ ఢమాల్.. ట్రంప్‌కు చెక్ పెట్టిన భారత్.. ఒక్క డీల్‌తో..
డాలర్ ఢమాల్.. ట్రంప్‌కు చెక్ పెట్టిన భారత్.. ఒక్క డీల్‌తో..
నిమ్మకాయలు ఎండిపోతున్నాయా? ఇలా స్టోర్‌ చేశారంటే 6 నెలల వరకు..
నిమ్మకాయలు ఎండిపోతున్నాయా? ఇలా స్టోర్‌ చేశారంటే 6 నెలల వరకు..
జనవరి 30న చికెన్, మటన్ షాపులు బంద్.. రీజన్ ఇదే..
జనవరి 30న చికెన్, మటన్ షాపులు బంద్.. రీజన్ ఇదే..
హాలీవుడ్ హీరోయిన్‌కు నాకు అదొక్కటి కామన్ అంటున్న మృణాళ్
హాలీవుడ్ హీరోయిన్‌కు నాకు అదొక్కటి కామన్ అంటున్న మృణాళ్